మహిళల భద్రతకు సీఎం కేసిఆర్ ప్రాధాన్యత

-రాష్ట్రంలో అరాచకాలు చేస్తే ఉపేక్షించేది లేదు….
-వరంగల్ భరోసా కేంద్ర భవన నిర్మాణ శంఖు స్థాపనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(వరంగల్, నవంబర్ 25): మహిళా భద్రత విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సీరియస్ గా ఉన్నారని అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ భరోసా కేంద్రాలు పెట్టి వారి భద్రతకు పెద్దపీట వేసారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భరోసా కేంద్ర నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
రాష్ట్రంలో అరాచకాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల విషయంలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని అధికారులను కోరారు.

భరోసా కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రజల్లో మార్పులు తీసుకురావాలి.అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వారిపై కఠినంగా వ్యవహరించాలి.సీఎం కేసిఆర్ గారుమహిళల భద్రత విషయంలో పట్టుదల గా ఉన్నారు.రాష్ట్రంలో పోలీస్ వాళ్ళు చాకచక్యంగా, పటిష్టంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారికి అదే స్థాయిలో విస్తృత అధికారాలు ఇచ్చి గౌరవం కూడా కల్పించింది.నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదు.గతంలో జీప్స్ అసోసియేషన్ ద్వారా జీప్స్ పెట్టుకుని పోలీసులు తిరిగే వారు. ఇప్పుడు ప్రతి పోలీస్ కు మంచి వాహనాలు ఇచ్చి, మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చారు.

హోమ్ గార్డ్స్ జీవితం గతంలో ఘోరంగా ఉండేది. కానీ నేడు హోం గార్డ్స్ వేతనం 20 వేలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం.మహిళల విషయంలో గతంలో ఆరాచకాలు జరిగేవి. నా దగ్గరకు రోజూ చాలా మంది మహిళా భాదితులు వచ్చే వారు.కానీ ఇప్పుడు అలాంటి ఫిర్యాదులు దాదాపు రావడం లేదు.మహిళకు భరోసా కేంద్రాలకు రాకుండా చూడాలి. వచ్చినా వారికి అన్ని విధాల సాయం చేయాలి.

జనగామ లో కూడా భవన ప్రారంభం చేయాలని జెమిని సంస్థ వారిని కోరుతున్నాను. ఇక్కడి(వరంగల్) సీపీ డైనమిక్ గా ఉన్నారు. సీఎం గారి ఆలోచనలు అమలు చేస్తున్నారు.ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ భరోసా కేంద్రం పని చేస్తుంది.పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. అంగన్ వాడి కేంద్రాల ద్వారా వారికి అన్ని రకాల తోడ్పాటు అందిస్తున్నాం. అరాచకాలు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. దోషులకు వారం రోజుల్లో శిక్షలు వేసింది ఈ వరంగల్ లోనే.భరోసా కేంద్ర భవనాన్ని త్వరగా నిర్మించాలి.

ఎంపీ పసునూరి దయాకర్….
తెలంగాణలో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉంటున్నారు. దేశంలో మనం నంబర్ వన్ గా ఉన్నాం. ప్రశాంతంగా ఉండేందుకు పోలీసులు చేస్తున్న కృషి అద్బుతం.మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు, దాడులు జరిగినా 24 గంటల్లో దోషులను పట్టుకుని శిక్షిస్తున్నారు. ఈరోజు మహిళల భద్రత కోసం భరోసా కేంద్రం కోసం నూతన భవన నిర్మాణాన్ని శంఖు స్థాపన చేసుకోవడం సంతోషం.

మేయర్ గుండు సుధారాణి…..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళా రక్షణ ధ్యేయంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి కేంద్రాలు పెట్టీ దేశానికి రోల్ మోడల్ చేశారు.ఫ్రెండ్లీ పోలీస్ గా మన తెలంగాణ పోలీస్ పని చేస్తున్నారు. మహిళలు తమపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి చెప్పుకోవడానికి ఈ షి టీమ్స్, భరోసా కేంద్రాలు తోడ్పడుతున్నాయి.ఇలాంటి వాటి కోసం జెమిని ఎడిబుల్స్ ముందుకు రావడం సంతోషం.మహిళల అన్ని రంగాల అభివృద్ది కి సీఎం కేసిఆర్ గారు మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు.డ్రగ్స్ నివారణ కోసం వరంగల్ పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేస్తూ..యువతని తప్పు దోవ పట్టకుండా పని చేస్తోంది.

చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…..
సీఎం కేసిఆర్ ఒక వైపు సంక్షేమం, అభివృద్ది చేస్తూనే మహిళలకు భరోసా, భద్రత ఇస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా షి టీమ్స్ పెట్టి అత్యంత భద్రత కల్పించారు.మహిళలకు మేయర్ పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసిఆర్ ది.వరంగల్ భరోసా కేంద్రం గతంలో నాటి మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకున్నాం.మహిళలు తమ సమస్యలు చెప్పుకునే ఫ్రెండ్లీ కేంద్రాలు మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు.జెమిని వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కొంతమంది పిల్లలను చెత్త కుప్పల్లో వేస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు, అలాంటివి చేయకుండా ఉండేందుకు ఐసీడీఎస్ వాళ్లు అనేక వాహనాలు పెట్టి పరిరక్షిస్తున్నారు.ఎవరైనా కూడా మీ పిల్లలు మీకు వద్దు అనుకుంటే వారిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా భరోసా కేంద్రాలు, ఊయలలు పెడుతున్నాం…అందులో వదిలి వెళ్లాలని విజ్ఞప్తి.

ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపి పసునూరి దయాకర్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ అశోక్, జెమిని సంస్థ ప్రతినిధులు చంద్ర శేఖర్ రెడ్డి, అనురాగ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.