Suryaa.co.in

Telangana

మంచి జీవితాన్ని త్యాగం చేసిన ఘనత దేవేందర్ గౌడ్‌దే

– దేవేందర్ గౌడ్ ఆ నాడు గోడలపైన టీజీ అని రాయించారు
– మా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం
– దేవేందర్ గౌడ్ లాంటి వారు క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడం తెలంగాణకు తీరని నష్టం
– విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్ది

హైదరాబాద్: వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారు. పుస్తకంలో దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ను ప్రజల కోణంలో పొందుపర్చారు. కొంత మంది తెలంగాణ ఉద్యమ చరిత్ర ను తమకనుకూలంగా మలుచుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రలో లిఖించాలి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ నే తెలంగాణ అని చరిత్రలో రాసే ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ఆనాడు ఆయన ఉన్న పార్టీలో నాయకుడి తర్వాత సరిసమానం గా చలామణి అయిన నేత దేవేందర్ గౌడ్.

మంచి జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చారు. గోదావరి జలాలతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని దేవేందర్ గౌడ్ ఆ నాడు పాదయాత్ర చేశారు. దేవేందర్ గౌడ్ పాదయాత్ర వల్ల నే ఆ నాటి పాలకులు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు ను చేపట్టారు. తెలంగాణ అంటే టీజీ అని ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాడు గుండెలపైన రాసుకున్నారు. దేవేందర్ గౌడ్ ఆ నాడు గోడలపైన టీజీ అని రాయించారు. ప్రజల ఆకాంక్ష మేరకు మా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం. జయ జయహే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికారిక గీతం గా తీసుకువచ్చాం. ఇవన్నీ నా ఆలోచనలు కావు.. ప్రజల ఆలోచనలు .

తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, కోటి రూపాయలు ప్రకటించాం. దేవేందర్ గౌడ్ లాంటి వారు క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడం తెలంగాణకు తీరని నష్టం. తెలంగాణ రాజకీయాల్లో విలువలతో కూడిన నాయకులు రావాలి.

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపి కె.కేశవరావు, వి.హన్మంతరావు, మధుయాష్కీగౌడ్ తదితర బీసీ నేతలు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE