Suryaa.co.in

Telangana

ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం

కులగణనపై సీడబ్ల్యుసీ తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం

హైదరాబాద్: దేశగణనలో కులగణనలో తెలంగాణను రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సీడబ్ల్యుసి తీర్మానం చేయడం తనకు ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్కక్తం చేశారు.సీడబ్ల్యుసీ భేటీకి హాజరైన రేవంత్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఎక్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు.

రేవంత్ ఏమన్నారంటే.. జన గణనలో కుల గణనకు తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి ఐన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది.

నాలుగు గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాక.. మొత్తం పౌర సమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కుల సంఘ నాయకులు, విద్యావేత్తల నుండి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి, శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిన విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన తీర్మానంలో ప్రస్తావించింది.

ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొక్కసారి నా అభినందనలు.

LEAVE A RESPONSE