Suryaa.co.in

Andhra Pradesh

దేవాదాయ శాఖలో అవినీతికి చోటుండరాదు

– సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
అమరావతి: ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:
దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్ధతులు తీసుకురావాలి: అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశం
టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలి:
ఆన్లైన్‌ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలి:
అవినీతికి చోటుండరాదు.
దేవాదాయ శాఖలో అవినీతికి చోటు లేకుండా చూడండి .
ఆన్లైన్‌ పద్ధతులను అమలు చేయడంద్వారా అవినీతి లేకుండా చూడొచ్చు.
ఆన్లైన్‌ పద్ధతులు దేవాలయాలకు మంచి చేస్తాయి.
వ్యవస్థలో మార్పులు వస్తాయి.
ఆన్లైన్‌ ద్వారా దాతలు ఎవరైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వొచ్చు.
ఆన్లైన్‌ పద్ధతులను, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు పెట్టాలి.
దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలి.
పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలి.
టీటీడీ తరహాలోనే ఇతర దేవాలయాల్లో కూడా వ్యవస్థలు ఉండాలి.
దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని అవినీతి లేకుండా ఆలయాల అభివృద్ధికోసం ఖర్చు చేయాలి.
క్రమం తప్పకుండా ఆలయాలను బాగు చేయడంపైన కూడా దృష్టిపెట్టాలి.
దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది.
భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదు:
నాణ్యమైన వసతి సదుపాయాలను వారికి అందుబాటులోకి తీసుకురావాలి:
ప్రతిదేవాలయంలో ఇచ్చే ప్రసాదాల నాణ్యతమీద దృష్టిపెట్టాలన్న సీఎం
భక్తులకు గుర్తుండిపోయేలా ప్రసాదాలు ఉండాలన్న సీఎం
తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లో వచ్చేలా చూడాలన్న సీఎం
దీనివల్ల నాణ్యతగా ప్రసాదాలు ఉంటాయన్న సీఎం
దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశం
దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుంది:
అన్ని దేవాలయాలకోసం మాస్లర్‌ప్లాన్లను రూపొందించాలి:
శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి:
క్రమం తప్పకుండా ఈప్లాన్‌ను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి:
టీటీడీ తరహాలో దేవాలయాల నిర్వహణ
దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలి .
దేవాలయాలో నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలి.
దేవాలయాల అభివృద్ధి ఈవో పనితీరుమీద ఆధారపడి ఉంటుంది.
టీటీడీ నిర్వహణా పద్ధతులపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ ఇవ్వాలి.
దేవాలయాల్లో మౌలిక సదుపాయల లోపాలు, తీసుకురావాల్సిన మార్పులను గుర్తించాలన్న సీఎం.
వీటిపై దృష్టిపెట్టి మార్పులు తీసుకు వచ్చేలా చూడాలన్న సీఎం
దేవాలయాల్లో ఆడిటింగ్‌ కూడా పారదర్శకంగా జరగాలి.
టీటీడీలో ఉన్న విధానాలను పాటించాలి.
ఆన్లైన్‌బుకింగ్, కియోస్క్‌లు, క్యూఆర్‌ కోడ్‌ పేమెంట్స్, ఆన్లైన్‌ రూం బుకింగ్‌ సిస్టం మొదలైన డిజిటలైజేషన్‌ ప్రక్రియకోసం టీటీడీ సహాయ సహకారాలు తీసుకోవాలన్న సీఎం
దేవాలయాల భూముల పరిరక్షణ..
దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా సర్వేచేసి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని సీఎం ఆదేశాలు
దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీని ఏర్పాటు చేసేదిశగా ఆలోచన చేయాలి:
ఆలయాల భద్రతపై..
రాష్ట్రంలోని సుమారు 18వేల ఆలయాల్లో భధ్రతకోసం సుమారు 47వేలకుపైగా సీసీ కెమెరాలు పెట్టాం.ఎక్కడ ఆలయాలు ఉన్నా.. వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టేలా చూడాలని అధికారులకు ఆదేశాలు.దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ మరియు సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశం.దేవాలయాల్లో భద్రత, తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
వంశపారంపర్య అర్చకులకు రిటైర్‌మెంట్‌ తొలగింపును అమలు చేశామన్న అధికారులు
మిగిలిన వారికి కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం
దేవాలయాల్లో పనిచేసే 1305 మంది అర్చకులకు కనీసం వేతనం 25శాతం పెంచుతామని హామీ ఇస్తే, వాస్తవానికి 56శాతం, 100శాతం పెంచామన్న అ«ధికారులు
దేవాలయాల్లో దూప ధీప నైవేద్యం కార్యక్రమం అమలుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
అర్చకులందరికీ ఇళ్లస్థలాల కేటాయింపుపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఇవ్వాళ్టి సమావేశంలో నిర్దేశించుకున్న అంశాల పురోగతిపై మరో 2 నెలల తర్వాత సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి: అధికారులకు సీఎం ఆదేశం
ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్‌) జి వాణీ మోహన్, టీడీడీ ఈవో డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE