Suryaa.co.in

Andhra Pradesh Telangana

స్వతంత్ర న్యూస్ చానెల్ స్టూడియో లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

విజయవాడ: అసెండస్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ త్వరలో ప్రారంభించనున్ప స్వతంత్ర ఛానల్ విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిలషించారు.

స్వతంత్ర టీవీ న్యూస్ చానెల్ స్టూడియో, టెస్ట్ సిగ్నల్ ను వైఎస్ జగన్  క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ లోని స్టూడియోలను ప్రత్యక్షంగా చూసి సిబ్బందికి, యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అసెండస్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్,. స్వతంత్ర టీవీ న్యూస్ చానెల్ సీఈఓ కృష్ణ ప్రసాద్ ..‌. ఛానల్ వివరాలను ముఖ్యమంత్రి కి సవివరంగా తెలియజేశారు.‌ అత్యున్నత సాంకేతిక విలువలతో సీనియర్ పాత్రికేయుల సారథ్యంలో న్యూస్ చానెల్ తీసుకుని వస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యూస్ ఛానల్ ఎడిటర్ తోట భావనారాయణ,
channel ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిహెచ్ వి రమణ రావు, అసిస్టెంట్ ఎడిటర్ రమ విశ్వనాథన్, చీఫ్ న్యూస్ కోర్డినేటర్ ఎ. అమరయ్య, టెక్నికల్ కన్సల్టెంట్ వైఎస్ సుధీర్ ను ముఖ్యమంత్రి కి పరిచయం చేశారు.‌ అనంతరం స్వతంత్ర టీవీ న్యూస్ చానెల్ ప్రోమోలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర ఛానల్ రూపొందించిన కార్యక్రమాలను సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ప్రత్యేకంగా తిలకించి, సిబ్బందిని అభినందించారు.

LEAVE A RESPONSE