సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం

Spread the love

-పదవులు పొందినవారు యాక్టివ్‌గా ఉండాలి..
-వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ సూచన

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థ‌లు, ఎమ్మెల్యే కోటా, గ‌వ‌ర్న‌ర్ కోటాకు సంబంధించి పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశామని, అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని, మిగిలిన నలుగురిలో ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారికి అవకాశం కల్పించామని చెప్పారు. పదవులు పొందినవారు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. అవినీతి చోటులేకుండా, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియజేయాలన్నారు.

Leave a Reply