ఎంతలా ఏలాడో…
ఎంతగా మారాడో..
హయ్యో..అంతలా కనుమరుగయ్యాడు..
కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్..
సూపర్ ఫాస్ట్ బండిలా
తమిళ సినిమాల్లో ఊపేసి..
కమల్..రజనీలను
సైతం దాటేసి..ఏలేసి..
టాలీవుడ్లో ఓ సైడ్లో
సెటిలై…తానే నవ్వులై..
చిరుకు మంచి ఫ్రెండు..
అయినా హిటలర్..హిటలర్
అంటూ ఏడిపించిన ట్రెండు..
జగపతిబాబుకు శుభాకాంక్షలు..
సూర్యవంశం బాతు బచ్చా..
ఇంతకీ హూ..
మన పితుహూ..
సుధాకర్..!
తెలుగోడే..తమిళంలో తిప్పేసాడు..
వరసగా నలభై అయిదు..
రాధికతోనే పద్దెనిమిది…
చెన్నైలో జెండా ఎత్తేసి..
భాగ్యనగరిలో కామెడీ..
ఒక ఏలుబడి..
అనంతరం
అనారోగ్యంతో అలజడి..
అదో పెద్ద ట్రాజెడీ..
నవ్వించే కళ కోమాలో..
భవిత డైలమాలో..
చావు తప్పినా
బాధలు తప్పని
నవ్వుల రాజు..
సినిమా నటులకు
ఇదే రివాజు!
చిరు..హరిప్రసాద్…
నారాయణరావు..
పాండీ బజార్ పాండవులు..
ఎవరికి ముందు బ్రేకొచ్చినా
మిగిలి’నోళ్ళ’ను చూడాలని
మిత్రబృందం అగ్రిమెంట్..
అందరిదీ ఇప్పటికీ
అదే కమిట్మెంట్..
ఒకరి తర్వాత ఒకరుగా
జీవితంలో సెటిల్మెంట్..
మెగాస్టారైనా
దగా చేయని కొణిదెల..
యముడికి మొగుడుగా
మిత్రులు ముగ్గురూ ఆర్థిక బాధల నుంచి విడుదల!
గోపిగా నవ్వించిన..
హరిశ్చంద్రగా జీవించిన..
బేతా వారి బుల్లి బేటాకి
శుభాకాంక్షలు..
మళ్లీ తెరపైకి వచ్చి
కడుపుబ్బ నవ్వించాలని
మా కాంక్షలు..
ఈలోగా మననం చేసుకుంటూ
నీ నవ్వుల లక్షలు!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286