Suryaa.co.in

Telangana

కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండా

-బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం చేస్తున్నాడు
– కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండా
– కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు.
– కోటిమందిని కోటీశ్వరులను చేయడం తరువాత సంగతి .. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండి
– రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తున్నాడు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జాతీయపార్టీలు పాడిన పాటే పాడుతున్నాయి .. పదేళ్లలో తెలంగాణకు చేసిన, కోరిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదు.కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ కోసం తమదయిన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదు. అంశాలవారీగా జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం లేదు

తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్దమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరించకుండా తోక ముడిచారు. పదేళ్ల నుండి బీజేపీ నేతలు మోడీ, అమిత్ షాలు కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి లేదు .. తక్కువ స్థానాలకే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ?

మరి ఇన్నేళ్లలో మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరువయ్యారు ? కాంగ్రెస్, బీజేపీలు అంత బలంగా ఉంటే ఎవరిని నిలబెట్టినా గెలవాలి కదా ? మరి ఎందుకు ఈ పార్టీలకు చేతకావడం లేదు ? పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారు. దక్షిణ భారతదేశంలో సమీప భవిష్యత్ లో బీజేపీ కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు.

పొరపాటున కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేస్తే మనను మనం దహించుకున్నట్లే .. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ విపక్షంగా కాంగ్రెస్వి పరీత హామీలను అమలుచేయాలని నిలదీయకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దౌర్జన్యంతో రాష్ట్రాలు, ప్రాంతీయపార్టీల హక్కులను హరించే విధంగా కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి

ఫెడరల్ స్ఫూర్థిని కాంగ్రెస్, బీజేపీలు అంగీకరించకుంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడమే. పదేళ్లలో దేశాన్ని, తెలంగాణను ఏ రంగంలో అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓట్లు వేయాలి ? అధిక ధరల మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నో మాటలు చెప్పాయి .. ఈ పదేళ్లలో ఏ రంగంలో ధరలు తగ్గించడానికి పనిచేశారు ?

బీజేపీ గత పదేళ్లలో ఎంత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది ? బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనేక లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది

అన్ని రంగాలలో అధోగతి పాలు చేసినందుకు బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలా ? కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్ నినాదం హస్యాస్పదం కోటిమందిని కోటీశ్వరులను చేయడం తరువాత సంగతి .. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండి

గుడ్లు బీకి గోళీలు ఆడుతాం .. తొండలు వదులుతాం .. మానవబాంబులం అయితాం అనడం నిజ జీవితంలోొ సాధ్యం కాదు … కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం గురించి సిగ్గుపడాలి .. అంత ఉబలాటంగా ఉంటే ఓ సినిమా తీసుకుని సంతోషపడండి. కేవలం మూడు నెలలలో తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుని పనిచేయండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తున్నాడు .. బీజేపీ పార్టీకి గులాం చేస్తున్నాడు . పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏక్ నాథ్ షిండే వస్తాడు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటున్నాడు .. మరి వారు అన్న మాటల గురించి స్పందించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా ? మోడీ వస్తే ఎందుకు వెళ్లి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నాడు ?

కేవలం నెల రోజులలో ఎన్నికలు పెట్టుకుని రేవంత్ ప్రధానిని ఎలా కలుస్తాడు అని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. చేతనయితే నిపుణుల సలహాలు తీసుకుని రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేసి చూయించాలి .. అప్పుడు అభినందిస్తాం. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అన్న బీజేపీ నేతల గురించి మాట్లాడే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు. నిందలు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలతో లాభపడుతాం అని కాంగ్రెస్ నేతలు భావిస్తే ప్రజలే సమాధానం చెబుతారు.

LEAVE A RESPONSE