కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతీ లేదు

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నిన్న సీఎం మహిళా సాధికారత మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బస్సులలో మహిళను రప్పించి రాజకీయ ప్రసంగం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అన్నారు. మహిళలను టాటా, బిర్లా, ఆదాని, అంబానీలతో పోటీపడేటట్లు చేస్తానన్నారు

వీటి మాట దేవుడెరుగు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు వంద రోజులలో ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తానన్నారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయి జమ చేయలేదు. కనీసం దానిపైన నిర్ణయం కూడా జరగలేదు. ఓట్ల కోసం చేసిన ప్రచారమే ఇది.

2000 రూపాయల పెన్షన్ ను 4000 చేస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ. దానికి అతీగతీ లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు కావస్తున్నది. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తూ… మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సుని మరో ఎన్నికల ప్రచార సభగా మార్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవాలు అన్ని మహిళలు గ్రహిస్తున్నారు సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు.

కళ్యాణమస్తు పథకం కింద ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలను నిర్మించి వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. స్వయం సహాయక బృందాలకు పావులా వడ్డీతో రుణాలను ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ.

మహిళా పారిశ్రామికవేత్తల కొరకు నైపుణ్యా శిక్షణ కేంద్రాలతో పాటు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. పుట్టిన ప్రతి ఆడ శిశువుకు ఆర్థిక సహాయంతో కూడిన బంగారు తల్లి పథకం పునరుద్ధరణ చేస్తానన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన వాగ్దానాలకు… కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు.

Leave a Reply