– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్పజెనవాడే సంగప్ప
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 ఎపిసోడ్ లు మన్ కి బాత్ తో ప్రపంచం లోనే చరిత్ర శృష్టించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. నరేంద్ర మోడీ గారి “మన్ కీ బాత్” 100 వ ఎపిసోడ్ ను నారాయణఖేడ్ లో కార్యకర్తలు, యువకులతో కలిసి ఆయన వీక్షించారు. ఈరోజు 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోవడం తెలంగాణ ప్రజలతోపాటు యావత్ దేశం సంబురంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని సంగప్ప అన్నారు. ప్రతినిత్యం విపక్షాలు, లౌకిక వాద ముసుగులో ఉన్న పార్టీలు నిరంతరం ప్రధానమంత్రిపై విషం కక్కుతూనే ఉన్నాయనీ, అయినా ఆయన ఏనాడూ వాటిని తిప్పికొట్టి రాజకీయ లబ్ది పొందడానికి ‘‘మన్ కీ బాత్’’ వేడుకను వాడుకోలేదని అయన పేర్కొన్నారు.
రాజకీయాలకు తావులేకుండా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? తమకు ఆసక్తి ఉన్న రంగాలపై ద్రుష్టి సారిస్తే కుల, మతం, వర్గం, ప్రాంతం, డబ్బుతో సంబంధం లేకుండా ఏ స్థాయికి ఎదగవచ్చో చెబుతూ దేశ ప్రజలను జాగ్రుతం చేసేందుకు ప్రధాని నిరంతరం యత్నించారని సంగప్ప చెప్పారు. దేశం లోని మారుమూల గ్రామాల్లో, ఆదివాసీ ఏజెన్సీల్లో ఏ సాయం అందకపోయినా కష్టపడి పైకొచ్చిన, అనుకున్నది సాధించిన వారితో ‘‘మన్ కీ బాత్’’ ద్వారా మాట్లాడుతూ… వారి అనుభవాలను యావత్ దేశానికి పంచుతూ మోడీ గారు వారిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశారని సంగప్ప అన్నారు. తెలంగాణ లో ఏ లాభాపేక్ష లేకుండా ప్రజల్లో విజ్ఝానం నింపాలనే ఆశయంతో సొంత ఖర్చుతో 2 లక్షల పుస్తకాలను సేకరించి సొంతంగా గ్రంధాలయం నిర్వహిస్తూ జ్ఝానాన్ని పంచుతున్న యాదాద్రి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య గారితో మోదీగారు నేరుగా మాట్లాడి… ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు.
అలాగే G-20 ఫ్లాగ్ ను రూపొందించిన సిరిసిల్ల హరిప్రసాద్, ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన బిడ్డ పూర్ణా మాలావత్ ను, విటమిన్-డి ట్యాబ్లెట్ ను తయారు చేసి ప్రపంచానికి అందించిన హైదరాబాద్ బిడ్డ చింతల వెంకట్ రెడ్డి, తెలంగాణ కళ పేరిణి న్రుత్య కళాకారుడు రాజ్ కుమార్ నాయక్, మాత్రు నారీ శక్తిగా పేరొందిన వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన అరుణ, ఆత్మనిర్బర్ భారత్ ద్వారా లబ్ది పొంది హన్మకొండ ఎంజీఎం ఆసుపత్రి వద్ద టీ స్టాల్ ను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహమ్మద్ పాషా తో మోడీ గారు నేరుగా మాట్లాడారు. కరోనాతో దేశమంతా వణికిపోతూ ధైర్యంగా చెప్పుకోలేని స్థితితో ఉన్న రోజుల్లో కరోనా సోకినా భయపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఎదుర్కొన్న హైదరాబాద్ కు చెందిన రామ్ తేజతోపాటు బోయినిపల్లి మార్కెట్ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచేయం చేసిన నాయకుడు నరేంద్రమోదీ.
అంతేగాదు… ప్రజలను, మహిళలను, విద్యార్థులను, రైతులను భయపెడుతున్న వివిధ అంశాలను ‘‘మన్ కీ బాత్’’ ద్వారా ప్రస్తావిస్తూ ధైర్యంగా ముందుకు సాగేలా చైతన్యం తీసుకొచ్చిన మహానేత మోదీ గారని ఆయన అన్నారు. కరోనా టైంలో ‘‘మన్ కీ బాత్’’ద్వారా టీవీ, రేడియో మాద్యమాల ద్వారా ఇచ్చిన ఒక్క సందేశంతో 140 కోట్ల మంది భారతీయులను బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం చేస్తూ కరోనాను కట్టడి చేసిన ఘనత మోదీగారిదే. అంతేగాదు… పరీక్షలంటేనే విద్యార్థులు వణికిపోయే పరిస్థితి. ఇగ తల్లిదండ్రుల ఆందోళన చెప్పనక్కర్లేదు..‘‘పరీక్షా పే చర్చ’’ పేరుతో నిర్వహించిన మన్ కీ బాత్ ద్వారా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆనందంగా పరీక్షలు ఎట్లా రాయాలో చెప్పడమే కాకుండా… పరీక్షల టైంలో తల్లిదండ్రులు ఏ విధంగా మసలుకోవాలో చెబుతూ… టెన్షన్ నుండి గట్టేక్కించే చిట్కాలు చెబుతూ స్పూర్తి నింపిన గొప్ప వ్యక్తి మోదీగారు. ఈ విధంగా అనే అంశాలను ప్రస్తావిస్తూ భారత జాతిని జాగ్రుతం చేసిన నరేంద్రమోదీగారికి తెలంగాణ ప్రజల పక్షాన సంగప్ప శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం లో బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు సాయిరాం, సుధాకర్, పట్నం మాణిక్, సతీష్, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.