-టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.బీసీ అనే పేరు వింటే జగన్ రెడ్డికి ఎందుకంత బీపీ ? జగన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృతమయ్యాయి. తాత రాజారెడ్డి నుంచి మనవడు జగన్ రెడ్డి వరకు అంతా బీసీలపై కక్ష్య సాధిస్తున్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో బీసీలకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువ. బీసీల్నీ ఆర్దికంగా రాజకీయంగా అణిచివేస్తున్న జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని పవర్ నుంచి దింపేసి బీసీల పవర్ ఏంటో చూపుతాం. బీసీ ద్రోహి జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి సాగనంపుతాం.