Suryaa.co.in

Telangana

వక్ఫ్ బిల్లుపై కోర్టుకెక్కిన కాంగ్రెస్, మజ్లిస్

హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ ఈ చట్టంపై పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ చట్టంలో తెచ్చిన మార్పులు రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టికల్స్ 14, 25, 26, 29, 300ఏలను ఈ సవరణలు ఉల్లంఘించాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ సవరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందినదే కాని, రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది.

LEAVE A RESPONSE