Suryaa.co.in

Telangana

ఇదో దిక్కుమాలిన.. దద్దమ్మ ప్రభుత్వం

– ఇప్పటిదాకా టన్నెల్ మృతదేహాలు తీయలేని దద్దమ్మ పాలన
– సుంకిశాల కూలినా స్పందించే ధైర్యం లేని రేవంత్ సర్కారు
– కేసీఆర్‌కు నోటీసుల వెనక కాంగ్రెస్-బీజేపీ కుట్ర
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

నల్గొండ: దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చారని.. ఇదంతా కాంగ్రెస్‌ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని స్పష్టం చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిందని, 8 మంది ప్రాణాలు కోల్పోయారని కానీ అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. కమిషన్‌ల ఆరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి కూడా సాహసం చేయలేకపోయారన్నారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. నల్గొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలిందని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నోటీసులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని, పాలన కనిపించడం లేదన్నారు.

డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE