-కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలి
– ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల మార్కెట్ : వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు, అందులో పొందుపరిచిన అంశాలను వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేశారో రాహుల్ గాంధీ చెప్పాలి. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయలేనివి తెలంగాణ లో అమలు చేస్తామంటూ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరు, పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరు, ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్.రైతుల ఖాతాల్లోకి నేరుగా 50 వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది.. దేశం లో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తం లో రైతులకు అందించారా ? రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ బిజెపిలకు లేనే లేదు.