Home » కాంగ్రెస్ గ్యారెంటీ లు ఆత్మలే

కాంగ్రెస్ గ్యారెంటీ లు ఆత్మలే

6 గ్యారంటీలను బొందపెట్టి రేవంత్ రెడ్డి ఆత్మలను చేశాడు
రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైంది?
15 వేలు ఇవ్వలేని మీకు సిగ్గుండాలి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్: తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేసిన్రు. తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారంటీలు అంటూ మోసం చేసినట్లు.. మరోసారి 5 గ్యారంటీలు అంటూ ఊదరగొట్రిన్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను బొందపెట్టి రేవంత్ రెడ్డి ఆత్మలను చేశాడు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరిచ్చిన 6 గారెంటీలు ఎక్కడా కనిపించక అత్మలై తిరుగుతున్నాయి. రాహుల్ గాందీ చెప్పినట్టు కాంగ్రెస్ గ్యారెంటీ లు అత్మలే . పంట నష్టపోయిన రైతులను ఆదుకోడం చేతకాదు.. కానీ, ఉప్పల్ స్టేడిమంలో క్రికెట్ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తున్నారు. బీజేపీ చేసిన ఉద్యోగ కల్పనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని విమర్శించే రేవంత్ కు సిగ్గుండాలి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాలు వరిధాన్యానికి రూ. 500 చొప్పున ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ కు సిగ్గుండాలి. ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో పర్యటన చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ సిగ్గుపడాలి.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే, కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే… తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలిస్తే ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇప్పుడిచ్చిన 5 గ్యారంటీలు అమలు చేస్తారట… అది అయ్యే పనేనా?ప్రజాసమస్యలు పక్కదారి పట్టించి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నరు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తుమ్మితే ఊడే దూదిపింజలా తయారుచేసిన్రు.

నరేంద్ర మోదీ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైనటువంటి 5 దేశాల్లో అగ్రగామి దేశంగా తయారైంది. మరో 15 సంవత్సరాలు ప్రజలు బిజెపిని ఆశీర్వదిస్తే ప్రపంచంలోనే భారత్ ను నం. 1 దేశంగా తీర్చిదిద్దుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయంలో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా..?

డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా ద్వారా ఐటీ, పారిశ్రామిక రంగం, ట్రేడ్ సెక్టార్, మ్యానుఫాక్చరింగ్, హాస్పిటాలిటీ వంటి అనేక రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది. అందుకే ప్రపంచంలోనే సుస్థిరమైన ఐదో దేశంగా భారత్ నిలిచింది. గత పదేళ్లలో ముద్ర లోన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మందికి రుణాలు అందించింది. ప్రభుత్వ పథకాల ద్వారా లక్షా 20 వేల సంస్థలను పునరుద్ధరణ చేసి 46 లక్షల 89 వేల మందికి ఉపాధి కల్పన జరిగింది. ఏ సెక్టార్ లో ఎంత ఉపాధి కలిగిందో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావాలి.

అమెరికా, యూకే లాంటి దేశాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగులను తొలగించిన సమయంలో.. భారత్ లో ఆత్మనిర్భర్ భారత్ పథకంతో చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద సంస్థల దాకా అందరికీ ఆర్థిక భద్రతనిచ్చి, వ్యాపారాలకు భరోసానిచ్చి ఉపాధి కల్పన కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 29 కోట్ల ప్రజలకు స్వయం ఉపాధికి ఉద్యోగాలు మోడీ కల్పించారు.. ఇదంతా ఎంప్లాయ్ మెంట్ కాదా..

విదేశాలలో ఉద్యోగాలు తీసేస్తుంటే భారత్ లో మాత్రం నిర్భర్ భారత్ లో భాగంగా ఉపాధి కల్పించింది మోడీ కాదా? భారత్ మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చే ఓట్లు అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల డబ్బులు వేరే వాటికి వాడుకొని కేంద్రం డబ్బులు ఇవ్వలేదన్నారు. కేంద్రం హడ్కో నుండి రుణం తీసుకోకుండా ఒక్క ఇల్లు కట్టి సూపియ్ రేవంత్ రెడ్డి.

ఆర్టీసీ వాళ్లకు ఇంతవరకూ ఉచిత ప్రయాణం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ గురించి ఇంతవరకు మాట్లాడని రేవంత్ రెడ్డి సిగ్గు పడాలి. రైతుల పంటలు చూద్దామని లేదుగానీ..క్రికెట్ కి వెళ్ళడానికి మాత్రం సిగ్గుండాలి. కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ నీ pm,cm నీ చెయ్యలేదు..మీరా మమ్మల్నా ప్రశ్నించేది…? ప్రభుత్వంలోఉన్నత స్థాయిలో పదువులు కేటాయించడం చేతకాని యూపీఏ ప్రభుత్వం విమర్శలు చేయడం సిగ్గుచేటు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తునన్నాం….. వెంట్రుక పీకలెరని మీరు,వారు తిట్టుకోవడం కాదు.. పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇంకోసారి ప్రధాని నరేంద్ర మోదీ గురించి,బీజేపీ పార్టీ గురించి మాట్లాడితే ఊరుకోం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణాసౌకర్యం తప్పితే.. మిగతా హామీల అమలు ఏది?

రైతు న్యాయం అంటూ మాట్లాడుతన్న రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? రైతులకు రూ. 15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని మాట తప్పని మీకు సిగ్గుండాలి. కౌలు రైతులను కనీసం గుర్తించకుండా రూ. 15 వేలు ఇవ్వలేని మీకు సిగ్గుండాలి.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రూ. 500 చొప్పున ప్రతి క్వింటాలుకు ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలి. యువ న్యాయం కింద లక్ష ఇస్తామంటున్నరు. తెలంగాణలో రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నరు. ఎందుకు ఇవ్వలేదు? దేశంలో 60 ఏండ్లు పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని సీఎం గా అవకాశం కల్పించలేదు. ఒక్క బీసీని సీఎంగా చేయలేని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

భారతదేశ ప్రధానమంత్రే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత నరేంద్ర మోదీది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష గ్యారంటీతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ… ముందుగా మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటున్న మీరు.. ముందుగా లోక్ సభస్థానాల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించండి. మీకు చేతనైతే పరిపాలనపై, ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి దృష్టిపెట్టాలి

Leave a Reply