ఆర్ఎస్ఎస్ రేవంత్.. నీ కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు
తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
ఆలీబాబా అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా మూడు డజన్ల దొంగల కమిటీ మీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. అవినీతికి, స్కాములకు కేరాఫ్ మీ పార్టీ. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటున్న రేవంత్ రెడ్డి… అసలు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే తెలంగాణ ప్రాంతం ఆంధ్రాలో కలిసిందనే చరిత్రను తెలుసుకో. హైదరాబాద్ స్టేట్ గా అత్యధిక రెవెన్యూతో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రకు ముడి పెట్టిందే ఈ కాంగ్రెస్.
ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిన నువ్వు.. కాస్త మీ కాంగ్రెస్ లో ఉన్న పాత లీడర్లను అడిగి చరిత్ర ఏంటో తెలుసుకో. ఆంధ్రతో కలిపి 60 ఏళ్లు మా ప్రాంతాన్ని దోచుకుతిన్నది కాంగ్రెస్ పార్టీ. సుసంపన్నంగా ఉన్న ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేసి సర్వనాశనం చేసింది మీ భస్మాసుర హస్తమే. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ తీసుకొచ్చి.. 9 ఏళ్లలో దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కేసీఆర్ .
ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతోంది. ప్రజల పరిస్థితి మెరుగుపడుతోంది. అసలు రేవంత్ రెడ్డి నీ మూలాలు ఏంటి? నీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది? నువ్వు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అయినా.. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్న బ్రోకర్ వి నువ్వు. నీ డబ్బుల కోసం నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్లకే వెన్నుపోటు పొడుస్తున్నయ్. రేపు నీ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినోళ్లను కూడా బీజేపీకి అమ్ముకుంటవ్. అంత పెద్ద క్రిమినల్ వి నువ్వు.
మీ పార్టీ నాయకులు నూటికి నూరు పాళ్లు చిత్తకార్తె కుక్కలే. అందులో ఎలాంటి అనుమానం లేదు. మా కేసీఆర్ గారు నూటికి నూరు పాళ్లు బాహుబలి. కాబట్టే ఆయన చేసిన పోరాటానికి దిగివచ్చి.. మరో మార్గం లేక ఆనాడు తెలంగాణను ప్రకటించారు మీ ఢిల్లీ పెద్దలు. ఢిల్లీకి బాద్ షాలం.. అని చెప్పుకున్న నీ పార్టీ పెద్దలకు కూడా చుక్కలు చూపించిన బాహుబలి ఆయన. తెలంగాణ మీరు పెట్టిన బిక్ష కాదు.
డ్రగ్స్ తీసుకుని పబ్బుల వెంట తిరిగే నీ రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్రలు చేయొచ్చుగానీ.. అనునిత్యం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న మా నాయకులు.. ఏ టెస్టుకు అయినా సిద్ధమంటూ సవాల్ విసిరి ధైర్యంగా నిలబడిన నాయకులు తిరిగితే నీకెందుకు అంత బాధ అవుతోంది. ఏనాడు తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మీరు చిత్తకార్తె కుక్కల్లా ఇప్పుడు ఓట్ల కోసం తెలంగాణలో తిరుగుతున్నారు.
తెలంగాణలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది. కొట్లాడీ తెలంగాణ తెచ్చిన పార్టీగా… 9 ఏళ్లలో కనీవిని ఎరుగని అభివృద్ధి చేసిన పార్టీగా మేం బరాబర్ ఓట్లు అడుగుతాం. ప్రజలు కూడా బరాబర్ మాకే ఓటేస్తారు.
ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి ఈ ప్రాంత నాశనానికి పునాదులు వేసిన మీకు, ఇక్కడ ఓటు అడిగే హక్కు కాదు కదా.. కనీసం ఇక్కడ ఉండే హక్కు కూడా లేదు. వందలాది మందిని పొట్టన పెట్టుకుని ఆనాడు తెలంగాణ ఇచ్చారు. మేమే ఇచ్చామని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగైతే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఆంగ్లేయులు కూడా గొప్ప వాళ్ళేనా..? దీనికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి.