– కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుందా? బీజేపీ రూల్ చేస్తుందా?
– బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ గడీలు బద్ధలు కొట్టాలి.
– ఫోక్సో కేసు నమోదయితే ప్రతి సారి సిట్ వేస్తారా?
– బిఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు
– ఇది కుల సమస్య కాదు లా అండ్ ఆర్డర్ సమస్య
– మోదీ 119 నియోజకవర్గాల్లో తిరిగినా బిఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరు.
– ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో బిఆర్ఎస్ భాధితురాలి పక్షాన ఉంది, బిఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారు. కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుల సమస్య కాదు లా అండ్ ఆర్డర్ సమస్య నిన్న కరీంనగర్ లో బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. చట్టానికి,పోలీసులకు బండి సంజయ్ కుమారుడు సహకరించాలి. ఈ అంశం ప్రజా సమస్య,శాంతి భద్రతల సమస్య.
సంఘటన జరిగిన తర్వాత బండి సంజయ్ ను ప్రధాన మంత్రి మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మోదీ తెలంగాణకు వచ్చి మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ ను ఎందుకు మోదీ మందలించలేదు? మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మోదీ అన్నారు.
చంద్రబాబు,పవన్ కళ్యా ణ్ ఇళ్లకు వెళ్లి మోదీ రాజకీయాలు మాట్లాడారు. బండి సంజయ్ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. బండి సంజయ్ తన కొడుకును ఎందుకు అదుపులో పెట్టుకోలేదు? రాష్ట్రంలో సీఎం హోంమంత్రిగా ఉన్నారు.అమ్మాయి కేసు పెడితే ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయి.
కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కొడుకు అని కేసును నీరుగార్చుతున్నారు. బండి సంజయ్ గాలి మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ను కొనసాగించడం ద్వారా బీజేపీ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలి. మోదీ హైదరాబాద్ కు వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ 119 నియోజకవర్గాల్లో తిరిగినా బిఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుందా బీజేపీ రూల్ చేస్తుందా అర్ధం కావడం లేదు. కరీంనగర్ లో నగల షాప్ లో దొంగతనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసినా పోలీసుల చర్యలు లేవు. ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ ఒక్కటి అయ్యాయి. నాతో కలిసి నడవాలని మోదీ రేవంత్ రెడ్డిని అన్నారు. దీని అర్ధం ఏంటి?
ఫోక్సో కేసు నమోదు అయితే ప్రతి సారి సిట్ వేస్తారా? క్యాంపు కార్యాలయాలపై దాడులు మంచి సాంప్రదాయం కాదు. నీ కుటుంబంలో సమస్య వస్తే ఎదుటి వాళ్ళ బాధలు బండి సంజయ్ కు అర్ధం అవుతున్నాయా? అమ్మాయికి న్యాయం చేయాలని బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది
బండి సంజయ్ ఎవరి అంతు చూస్తారు? బిఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారు. కుటుంబం బాధ బండి సంజయ్ కు ఎదుటి వారిని అనేటప్పుడు గుర్తు రాలేదా? సిట్ కు సహకరిస్తారా లేదా ?బండి సంజయ్ సమాధానం చెప్పాలి.
ఇది కుల సమస్య కాదు. అబ్బాయి,అమ్మాయి ఇద్దరూ బీసీలే. ఇది శాంతి భద్రతల సమస్య. బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ గడీలు బద్ధలు కొట్టాలి. కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలకు శత్రువు బిఆర్ఎస్ అయింది. బి ఆర్ ఎస్ టార్గెట్ గా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి.
మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బిఆర్ఎస్ వారి తరపున ఉంటుంది. కాంగ్రెస్, బిజెపి వాళ్ళు సోషల్ మీడియాలో కేటిఆర్ పై ఎన్ని రంకులు అంటగట్టారు? బండి సంజయ్ కేటీఆర్ పై మాట్లాడిన మాటలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడరు.
అంతుచూస్తా అని బండి సంజయ్ అంటే కేసు ఎందుకు పెట్టలేదు?వరంగల్ లో కేటిఆర్ మాట్లాడితే కేసులు పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు.
పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది వినాలని అనుకుంటే ఖద్దరు చొక్కాలు వేసుకోండి. డీజీపీ గతంలో సీపీగా పని చేశారు..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మిత్ర బృందంగా మారాయి. కాంగ్రెస్ ను సైకిల్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ గా మార్చారు