రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర

•జగన్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది
•బలమైన నేతగా ఉన్న ఏలూరిపై దుష్ప్రచారం
•అభ్యర్థులు లేక గెలవలేమనే భావనలో వైసిపి
•అధికార అడ్డం పెట్టుకొని సంస్థలపై దాడులు
•జగన్ ప్రభుత్వం పుట్టుకే విధ్వంసం
•పర్చూరులో సాంబశివరావు విజయం ఖాయం
•ఆయన గెలుపును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు
•దొంగ ఓట్ల పేరుతో అక్రమాలకు తెరలేపిన వైసిపి
•అర్హుల ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పి కొట్టిన ఏలూరి
•నోవా అగ్రి గ్రూప్స్ పై బురదల్లే కుట్ర
•అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జగన్
•కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి

బలమైన నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద చల్లేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పర్చూరు నియోజకవర్గంలో గెలవలేమనే భయంతో ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రతిష్టను దిగజార్చాలని కుట్రతో దిగజారుడు రాజకీయానికి ప్రభుత్వ పెద్దలు తెరలైపారని మండిపడ్డారు. రాజకీయంగా ఏలూరిని ఎదుర్కొనే అభ్యర్థి దొరక్కపోవడం , ఏలూరిపై నిలబడే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు లేకపోవడం వైసీపీకి శాపంగా మారిందన్నారు. దీంతో తాడేపల్లి పెద్దలు ఏలూరిని ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో అధికార దర్పాన్ని వినియోగించి కుట్రలకు తరలిపారని మండిపడ్డారు.

15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఏలూరి నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించారని, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా పలువురు డైరెక్టర్ల ఆధీనంలో నోవా నడుస్తుందన్నారు. ఆ కంపెనీలో లోటుపాట్లు ఉంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అక్రమ మార్గంలో గెలవాలని తలంపుతో ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలూరి పోరాటం సాగించారని ఆ కక్షతోనే కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పుట్టకే విధ్వంసంతో ప్రారంభమైందని అలాంటి ప్రభుత్వం నీతి నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు.

నోవా గ్రూప్ సంస్థ ఐ పీ ఓ (తొలి పబ్లిక్ ఆఫర్)లో అడుగుపెట్టిందనే కక్షతో అధికారం అడ్డం పెట్టుకొని దాడుల పేరుతో ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారన్నారు.ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్యే ఏలూరి టిడిపి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు. జగన్ రెడ్డి కుట్రలు ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే ఏలూరి అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఉందన్నారు. సీఎం కార్యాలయం తాడేపల్లి నుంచి ఎమ్మెల్యే ఏలూరిపై కుట్రలకు డైరెక్షన్ చేస్తున్నారని అవి పర్చూరులో సాగవన్నారు. గతంలో సైతం హెరిటేజ్ సంస్థలపై బురద చల్లిన ప్రభుత్వ పెద్దలు తాజాగా ఎమ్మెల్యే ఏలూరి స్థాపించిన సంస్థలపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదుర్కోలేక అనేకమంది పై ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారని దీనికి వైసిపి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు.ఎప్పటికైనా వైసీపీ పెద్దలు ఎమ్మెల్యే ఏలూరిపై చీప్ పాలిటిక్స్ మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలన్నారు.రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసిపి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని హెచ్చరించారు. పర్చూరు ప్రజల్లో ఎమ్మెల్యే ఏలూరిపై ఉన్న నమ్మకం ప్రేమ ఆప్యాయతలు చెరిపేందుకు చేస్తున్న కుట్రలు ఎన్నికల్లో పటాపంచలవుతాయన్నారు.

Leave a Reply