Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ గేమ్ ఓవర్….టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ!

-జగన్ పాలనా బాధితులంతా నాకు స్టార్ క్యాంపెయినర్లు
-సామాజిక న్యాయం అంటాడు….జగన్ రెడ్డి తన సామంతులతో పాలన చేస్తాడు
-అమర్నాథ్ ను చంపిన వాళ్లు బయట తిరగడమే సామాజిక న్యాయమా?
-కోడికత్తి శ్రీను జైల్లో…బాబాయి హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా?
-ఓటు అనే వజ్రాయుధంతో కలియుగ భస్మాసురుడిని తరిమికొట్టండి: రాజమండ్రి రూరల్ రా కదలి రా సభలో నారా చంద్రబాబు నాయుడు

రాజమహేంద్రవరం: వైసీపీ గేమ్ ఓవర్….టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో నష్టపోయిన బాధితులే నాకు స్టార్ క్యాంపెయినర్లు అని ఆయన ప్రకటించారు. జగన్ సామాజిక న్యాయం అంటాడు…. మళ్లీ రాష్ట్రం అంతా తన వర్గానికి చెందిన సామంతులతో పాలన చేస్తాడు అని ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 10వ తరగతి విద్యార్థి బిసి బిడ్డ అమర్నాథ్ ను చంపిన వాళ్లు బయట తిరగడమే సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. కోడికత్తి శ్రీను జైల్లో…బాబాయి హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా అని జగన్ ను ప్రశ్నించారు.

రాజమండ్రి రూరల్ లో జరిగిన రా కదలి రా సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మండి పడ్డారు. పలు ప్రశ్నలతో జగను ను నిలదీశారు.

“ఈ రోజు రాజమండ్రి రంకేసింది. రాజమహేంద్రవరం దద్దరిల్లింది. త్వరలో మంచిరోజులు వస్తాయి . టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు. రాజమండ్రికి రాజమహేంద్రవరం అని పేరు పెట్టింది నేనే. కందుకూరి వీరేశలింగం గారు ఈ గడ్డపై నుంచే సంస్కరణలు ప్రారంభించారు. సైకో జగన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆనాడు నేను దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధి చేశాను. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే అందుకు తెలుగుదేశం పార్టీ వేసిన పునాదులే కారణం. నేనిచ్చిన ఐటీ ఆయుధంతో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా స్థిరపడ్డారు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కు ఏమైనా అనుమానం ఉంటే మీ పిల్లలను అడగండి. వారు కూడా నా లబ్ధిదారులే అని చంద్రబాబు అన్నారు.

సైకో రెడ్డిని తరిమికొట్టండి:
రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోంది. మానసిక రోగి రాష్ట్రాన్ని పాలించడం బాధాకరం. ఈ ముఖ్యమంత్రి విశాఖలో మీటింగ్ పెట్టాడు. రాజకీయ విమర్శలకు నేను బాధపడను. కానీ నాది, పవన్ ది ఫోటో పెట్టి బూటు కాలితో తన్నించాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఏమనాలి? ఇలాంటి చర్యలను నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా? ప్రజల కోసమే మిమ్మల్ని భరిస్తున్నాం. మీ సంగతి తేల్చడం….నాకు ఒక్క నిమిషం పని. దుర్మార్గుడి చేతి నుంచి ప్రజలను కాపాడాలనే నేను తపిస్తున్నాను.

ఖబడ్ధార్ వైసీపీ నేతలారా?…ఆడబిడ్డల జోలికొస్తే తోలుతీస్తా
నిన్ననే మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు వేధించారు.కొట్టారు. పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారు. ఆ బాధలు తాళలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సైకో పాలనలో బలవంతపు మరణాలు లెక్కలేనన్ని జరిగాయి. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే. నీ దగ్గర అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నావ్. ఇలాంటి వారిని చాలామందిని చూశాను. కాలగర్భంలో కలిసిపోవడం గ్యారంటీ. జగన్ పెద్ద సైకో అయితే మాచర్ల ఎమ్మెల్యే చిన్న సైకో. అనంతపురంలో ఒక మహిళను వైసీపీ నేత నటరాజ్ కోరిక తీర్చమని వేధించాడు. అందుకు ఒప్పుకోలేదని నడిరోడ్డుపై కొట్టాడు. మరో వైసీపీ నేతల సంక్షేమ పథకాలు ఇవ్వమంటే….పడుకుంటావా అని అడిగాడు. ఆంబోతుల మాదిరిగా వైసీపీ నేతలు ఊరిమీద పడ్డారు. నా ఆడబిడ్డల జోలికొస్తే ఖబద్ధార్ జగన్ రెడ్డీ.

ఆంబోతు రాంబాబూ…నీకు కళ్లెం వేస్తా:
కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నియోజకవర్గానికి పోతే ఆంబోతు రాంబాబు ఆయనపై దాడ చేశాడు.. ఆంబోతూ …నీకు కళ్లెం వేస్తా….వదలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. అవినీతి డబ్బుతో, అధికార మదంతో ప్రవర్తిస్తే తగిన శాస్తి చేస్తాను. వదిలిపెట్టను ఎవర్నీ. ఖబద్ధార్ …జాగ్రత్తగా ఉండు.

తెలుగుదేశం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ!
వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా నేతలు భయపడి పారిపోతున్నారు. 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లు గల్లంతు. బదిలీలు చేసేస్తున్నారు నేతలను. నా రాజకీయ జీవితంలో నేతల బదిలీ ఎప్పుడూ చూడలేదు. ఒక ఊరి చెత్త ఇంకో ఊరిలో వేస్తే బంగారం అవుతుందా ? 49 మంది బడుగు, బలహీన వర్గాల నేతలను, 11 మంది దళితులు, నలుగురు బీసీలను దూరం పెట్టారు. మీ సీటుకో దండమని 4గురు ఎంపీలు పారిపోయారు.

మనం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజనామా చేశారు. తానేటి వనిత, చెల్లని వేణుగోపాల్ , ఆదిమూలపు, మేరుగ, గుమ్మనూరు, జోగి, ఉషశ్రీ చరణ్ సహా 10మంది మంత్రులు అవుటయ్యారు. గేమ్ ఈజ్ ఓవర్ తమ్ముళ్లూ…గుడివాడ 10 మంది మంత్రులు అవుట్. గేమ్ ఈజ్ ఓవర్ . టీడీపీ- జనసేన పొత్తు అనగానే ప్యాంటులు తడిచాయి. డైపర్లు వేసుకుని తిరుగుతున్నారు. రేపో, ఎల్లుండో వైసీపీ వెంటిలేటర్ పైకి వెళ్లబోతోంది. నో డౌట్…

దళితులు సైకో జగన్ రెడ్డి ఎదుట నిలబడకూడదంట.. మాట్లాడకూడదంట. నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేల దాడులు చేశారు. 188 మందిని పొట్టన పెట్టుకున్నారు. మాస్క్ అడిగిన సుధాకర్ ను చంపేశారు. కోత్తి కొత్తి శ్రీను జైల్లో మగ్గుతున్నాడు. బాబాయ్ ని చంపిన అవినాష్ దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఊరికో దళితుడిని బలిచేశావ్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే జగన్ రెడ్డి సామంత రాజులతో పాలన చేస్తున్నాడు. రాష్ట్రమంతా వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి , పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిదే పెత్తనం.

ఎన్నికలకు ముందే వైసీపీ ఓడిపోయింది
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ ఇస్తామన్నారు. ఎందుకో చెప్పమంటే నీ గ్రాఫ్ బాలేదు. అందుకే ఎంపీగా వెళ్ళమన్నాడు ముఖ్యమంత్రి. ఒక దళితుడునైన తనకు సీటు రాకపోవడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమని డైరెక్టుగానే ఆదిమూలం ముఖ్యమంత్రికి చెప్పాడు. అయినా న్యాయం జరగలేదు. పెద్దిరెడ్డి ఏది దొరికితే అది తినేసే రకం అతనిపై చర్యలు తీసుకోగలవా జగన్ రెడ్డీ? పెద్దిరెడ్డికి ఒక న్యాయం …ఆదిమూలంకు ఒక న్యాయమా? కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు సర్వేలో వ్యతిరేకత వచ్చిందని ముఖ్యమంత్రి చెబితే అతను ఖరాఖండీగా చెప్పేశాడు.

నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. మర్డర్లు చేయలేదు. చేసినవారికి సపోర్ట్ చేయలేదన్నాడు. రాష్ట్రంలో అవినీతి కేంద్రీకృతమైందని దేశమంతా చెప్పుకుంటున్నారని ఆ ఎమ్మెల్యే సీఎం మొహానే చెప్పి బయటకు వచ్చేశాడు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓడిపోయింది. రాష్ట్రాన్ని కాపాడుకోవడడం మనందరి బాధ్యత.నిన్న ఒక్కరోజే నాలుగు సంఘటనలు. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు. ఒక ఎస్సీ నేతకు న్యాయం జరగలేదు. ఒక స్త్రీపై దాడి చేస్తే అడిగే నాధుడు లేడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోడానికే నేను మీ ముందుకొచ్చా. రా కదిలిరా పిలుపునిచ్చా. ఇది ఐదు కోట్లు ఆంధ్రుల కార్యక్రమం. ఇది. ఐదు కోట్లమంది జగన్ రెడ్డినరి దించడానికి సిద్ధంగా ఉన్నారు.

సైకిల్ ఎక్కండి…గ్లాస్ పట్టుకోండి;
ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? డీఎస్సీ పెట్టాడా? ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నాడు. గంజాయి వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆరోజు గట్టిగా పోరాడితే టీడీపీ ఆఫీస్ పైనా , నా ఇంటిపై దాడి చేశారు. పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నాడు . మన రాష్ట్రంలో ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి దొరుకుతుంది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కలిసి అరాచకం సృష్టిస్తున్నారు. తమ్మూళ్లూ మీ భవిష్యత్ బాగుండాలంటే టీడీపీ-జనసేనకు మద్దతివ్వండి. ప్రతి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకూ 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తా. వర్క్ ఫ్రమ్ హోంకు శ్రీకారం చుడతా. మండల కేంద్రంలో వర్క్ స్టేషన్లు పెడతా. 72 రోజుల కౌంట డౌన్ . సైకిల్ ఎక్కండి. గ్లాస్ పట్టుకోండి. టీడీపీ- జనసేన జెండాలు పట్టుకోండి.

వ్యవసాయ రంగాన్ని భ్రష్టుపట్టించారు
ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయశాఖను మూసేశారు. ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేశారు. వరిధాన్యం పండించాలి. మన పంటలు అనుగుణంగా మార్చుకోవాలి. పామాయిల్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ . రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు మొత్తం ముంచాడు. వరి కొనే దిగ్గులేదు. త్వరలో రైతు రాజ్యం వస్తుంది. మనం 72 శాతం పోలవరం పూర్తిచేస్తే దాన్ని నాశనం చేశాడు. కరెంటు చార్జీలు 9 సార్లు పెంచాడు. 56 వేల కోట్ల భారం వేశాడు. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు టీడీపీ .

వచ్చే ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చేబాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వాణ్ణి పక్కన పెట్టుకుని ఈ ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడు. దళితులకు మేలు చేసే 26 సంక్షేమ పథకాలు రద్దు చేశారు.ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేశావా జగన్ రెడ్డీ? తమ్ముళ్లూ….మీరు నడిచే రోడ్లు నేను వేసినవే. మీరు తినే తిండికి వాడే గ్యాస్ నేనిచ్చిందే. మీరు రోడ్డుపై తిరిగినప్పుడు వెలిగే ఎల్ ఈడీ బల్బులు నేను ఇచ్చినవే. అంబేద్కర్ పేరు తీసి తన పేరు పెట్టుకుంటున్నాడు. నీతులు చెబుతాడు. సైకో పనులు చేస్తాడు.

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం
ఆడబిడ్డలను ఆదుకోడానిక భవిష్య్ త్ కు గ్యారంటీ కార్యక్రమం తెచ్చాం. అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు, ఆస్తిహక్క కల్పించారు. నేను ఉద్యోగాల్లో, అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాను. డ్వాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పాను. ఇంటికే పరిమితమైన ఆడబిడ్డను డ్వాక్రాతో అన్నింటా చక్రం తిప్పేలా తయారుచేశాను. రాబోయే కాలంలో ఆడబిడ్డల సహాయ సహకారాలు తీసుకుని పేదరిక నిర్మాలన చేస్తా. ప్రతి ఆడిబిడ్డకు నెలకు రూ. 1500 అకౌంట్ లో వేస్తాను. తల్లికి వందనం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉండు అందరికీ ఏడాదికి రూ 15,000 ఇస్తాను. ప్రతి ఆడబిడ్డకు మూడు సిలిండెర్లు, ఆర్టీసీ బస్పుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తాను.

బకాయిలు చెల్లించమంటే బెదిరిస్తావా?
ఆరోగ్యశ్రీని అటకెక్కించి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. రూ 1200 కోట్లు బకాయిలు చెల్లించకుండా రౌడీలను పంపి బెదిరిస్తున్నాడు. ఆస్పత్రులు భయపడొద్దు. మేం వస్తున్నాం. ఆదుకుంటాం. పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరోవైపు సర్వే రాళ్లపైనా సైకో రెడ్డి ఫోటోలే. ఇంట్లో టీవీలో నీ ఫోటో,మరుగుదొడ్డికి పోయినా నీ ఫోటోనే చూడాలా? భూ రక్షణ చట్టం ఫేక్…రికార్డులు మార్చేసి మీ భూమిని కొట్టేసేందుకు ప్లాన్ చేశాడు. ఫేక్ చట్టాన్ని మేమొచ్చాక రద్దు చేస్తాం. ఆవ భూముల్లో అవినీతి చేసి రూ. 600 కోట్ల కుంభకోణం చేశాడు జగన్ రెడ్డి. మేము వచ్చాక ఈ దొంగలు తిన్న డబ్బులు కక్కిస్తాం.

తూర్పుగోదావరి జిల్లాను దోచేశారు వైసీపీ నేతలు
ఇక్కడున్న రాజమండ్రి ఎంపీ రీల్స్ మాస్టర్. పార్లమెంటులో మాట్లాడడు. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతూనే ఉంటాడు. అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు. పూలు చల్లించుకుంటాడు. నీ రీల్స్ చూసి అలిసిపోయామని ఒక తన్ను తన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. ఆవ భూముల కుంభకోణంలో ఎంపీగారి వాటా రూ. 150 కోట్లు . అనపర్తి ఎమ్మల్యే మరోపేరు గ్రావెల్ రెడ్డి. ఆయన సతీమణి కూడా అదే పని. కోట్లు కొల్లగొట్టాడు.కుటుంబం మొత్తం అవినీతిమయం. రాజానగరం జక్కంపూడి రాజా …బ్లేడ్ బ్యాచ్ లీడర్ . పేదల ఇళ్ల స్థలాలు కొట్టేస్తున్నాడు. గొప్ప నాయకుడు. కొండలు కరిగించేస్తున్నాడు. ఆయన భోజనమే ఇసుక, గ్రావెల్. కొవ్వూరు మంత్రిని గోపాలపురానికి తరిమేశారు. మరో ఎమ్మెల్యే తలారి అవినీతికి అడ్డా. ఆయన సీటూ పాయే. ఆయన కొవ్వూరు ఈవిడ గోపాలపురానికి. అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త అక్కడికి వేస్తే గెలుస్తారా? చిన్నప్పుడు నేను ఊళ్లలో చూసే వాణ్ని కనికట్టు ఆటలు. వాటికి లేటెస్ట్ వెర్షనే జగన్మాయ.

వచ్చేది మన ప్రభుత్వమే:
మన ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిని టూరిజనం హబ్ గా తయారుచేస్తాను. ధాన్యం రైతులను, ఆక్వా రైతులను ఆదుకుంటాం. రోడ్లు బాగుచేస్తాం. ఉచిత ఇసుక తెస్తా. పంట కాలువలు ఆధునీకరిస్తా. కలియుగ భస్మాసురుణ్ణి తరిమికొడదాం. సైకో పాలనకు నేనూ బాధితుణ్ణే. ఐదేళ్లు మనకు దారి దొరకలేదు. ఎంపీ జయదేవ్…రాజకీయ విరామం కోరాడంటే అర్ధం చేసుకోండి. సైకో దెబ్బకు అందరూ పారిపోతున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధాం. 72 రోజుల్లో జరిగే ఎన్నికల్లో వజ్రాయుధం లాంటి మీ ఓటుతో భస్మాసురుడిని తుదముట్టించండి. నష్టపోయిన బాధితులే నాకు స్టార్ క్యాంపెయినర్లు. సైకో పాలన పోవాలి. సైకిల్ పాలన రావాలి. అన్న దాతల సంక్షేమం కోసం , మన బిడ్డల ఉద్యోగాల కోసం జీవనాడి పోలవరం కోసం, గంజాయి లేని సమాజం కోసం, బడుగుల ఆత్మగౌరవం కోసం, రాతియుగం పోవాలి-స్వర్ణయుగం రావాలి. తెలుగుదేశం-జనసేన ఐక్యత వర్ధిల్లాలి అని చంద్రబాబు నాయుడు రా కదలి రా సభలో పిలుపు నిచ్చారు.

LEAVE A RESPONSE