కోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేని సిఐడీ

– మొట్టికాయలు నిరంతర ప్రక్రియ అయిపోవడం దురదృష్టకరం
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బానిసత్వం చేయడంలో, రాష్ట్రం లోని అన్ని వ్యవస్థలను మించి సీఐడీ ప్రథమ స్థానంలో నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

కోర్టు మొట్టికాయలు సీఐడీ వారి దినచర్యలో నిత్యకృత్యం అయ్యాయి అనేందుకు NRI యశస్వి ఉదంతం తాజా ఉదాహరణ అని వర్ల అన్నారు. యశస్వి పాస్పోర్ట్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో పెడచెవిన పెట్టిన సీఐడీ తీరుతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, యశస్వి పాస్పోర్ట్ వెనక్కి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించిండంతో వర్ల హర్షం వ్యక్తం చేశారు

ఆడవారిపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడి, అధినేత చంద్రబాబును మొదలుకుని, పార్టీ లోని సాధారణ కార్యకర్తల వరకు అత్యంత నీచంగా మాట్లాడి, SC ST లను సైతం “ల”కారాలతో మాట్లాడే వైసీపీ మద్దతుదారుడు, పంచ్ ప్రభాకర్ అనే ఉన్మాదిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని సీఐడీ చీఫ్ సంజయ్ ను వర్ల ప్రశ్నించారు.

మన్విత్ కృష్ణారెడ్డి అనే వైసీపీ మద్దతుదారుడు తెలుగుదేశం వాడిలా జండాలు కట్టుకుని ప్రజల మధ్య కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సీఐడీ చోద్యం చూస్తోంది.

జగన్ రెడ్డి మాటలు విని మీరు మా పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే.. మేము కోర్టు ద్వారా మీ అన్యాయాలను ఎదుర్కొంటామే కానీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, మీరు జగన్ రెడ్డిని నమ్ముకుంటే మేము కోర్టులను నమ్ముకున్నామని, చివరకు న్యాయం గెలిచిందని వర్ల రామయ్య అన్నారు. గతంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులపై కూడా, ప్రభుత్వం పై కోర్టు మొట్టికాయలు వేయడాన్ని రామయ్య గుర్తు చేశారు.

Leave a Reply