జగన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లింది

– కె.ఎస్. జవహర్, పీతల సుజాత

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఓ దళిత అంగన్వాడి కార్యకర్తపై అధికార పార్టికి చెందిన ఎంపిటీసీ సభ్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినా ప్రభుత్వం స్పందించటం లేదు. బాధితురాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు. బిక్కవోలులో నిర్వహించిన అంగన్వాడీల సమ్మెలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయి. దళిత మహిళపై లైంగిక వేధింపులకు కారణమైన ప్రతీ ఒక్కరిపైన కేసు నమోదు చేసి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు కె.ఎస్. జవహర్, పీతల సుజాత, తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, అనపర్తి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, తూర్పు గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి, తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు అంగన్వాడీలకు అండగా సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply