Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోంది

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడిన మాటలు..

కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మత్సకారుడు:
అనేక వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించారు, ఎంతోమంది బీసీలపై దాడులు, దౌర్జన్యాలు చేసినా జగన్ కు ఇంకా దాహం తీరలేదు. ఇటీవల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంనందలి బంగారుపెంట గ్రామానికి చెందిన బీసీ మత్స్యకారుడు చెవిటిపల్లి దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మత్స్యకారుడిని ముఖ్యమంత్రి జగన్ పొట్టన పెట్టుకున్నట్లైంది. ఈ సంఘటన చాలా దారుణం, దుర్మార్గం. పో

లీసులు బెదిరించడంతోనే ఈ మత్స్యకారుడు చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నాడని అతనిపై అక్రమ కేసు పెట్టారు. ఆ తరువాత వైసీపీలో చేరుతావా? చేరవా? అని బెదిరించారు. వైసీపీలో చేరలేదనే ఉద్దేశంతో అతనిపై అక్రమ కేసు పెట్టారు. 2 లక్షల డబ్బులివ్వమని భయపెట్టారు. అతను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అతనిపై అక్కసుతో నీవు స్టేషన్ కు రా, నిన్ను ఎన్ కౌంటర్ చేస్తా అని బెదిరిస్తే పోలీసు స్టేషన్ కు సంతకం పెట్టడానికి వెళ్లాల్సిన అతను భయపడి తను వేటకు వెళ్లే బోటులో ఎక్కి వలకు ఉన్న తాడును మెడకు చుట్టుకొని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు, ఆకృత్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు అధికమయ్యాయి.

బీసీలు బతకాలంటే భయమేస్తోంది :
ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక ఆటలు ఆడుతోంది. ఇవన్నీ చూస్తుంటే బలహీనవర్గాలకు బతికే హక్కుందా అని భయమేస్తోంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య టీడీపీలో బ్రహ్మానందరెడ్డికి తోడుగా ఉన్నాడని అతనిపై వేధింపులకు పాల్పడ్డారు. జై జగనన్న అని చెప్పమంటే జై చంద్రబాబు అని చెప్పినందుకు నడిరోడ్డుపై కోడిని కోసినట్లు పీక కోసి చంపారు. జల్లా యాదవ్ ను కూడా అనేక హింసలు పెట్టారు. చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను కూడా పొట్టన పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మత్స్యకార మహిళ పద్మ వైసీపీలో చేరమంటే చేరలేదని వివస్త్రను చేసి వేధించారు.

దీంతో ఆమె సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు శ్రీకాకుళంకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డిక సోదరుడు సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తుంటే కుప్పం వెళ్లేలనే ఉద్దేశంతో పుంగనూరుకు చేరుకున్నప్పుడు అతడిని బట్టలు ఊడదీసి రోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడకు చెందిన బొందల అనే బీసీ సామాజిక కులానికి చెందిన రాంసింగ్ అనే ఆర్టీసీ బస్ డ్రైవర్ హారన్ కొట్టాడని నడి రోడ్డుపై దారుణంగా చితకబాదారు. చావు బతుకుల మధ్య ఉన్న అతడిని పలకరించడానికి టీడీపీ నాయకులు వెళితే పోలీసులు అడ్డగించారు. రేపల్లెలో పదవ తరగతి చదివే బీసీకి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే యువకుడు తన అక్కను వేధించవద్దని చెప్పినందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు. వైసీపీ నాయకులు పరామర్శించలేదు. విజయనగరం జిల్లాలో కృష్ణా మాష్టర్ ని దారుణంగా హత్య చేశారు.

బీసీలకు ఒక్క సైసా సహాయం లేదు :
బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసా సహాయం చేయలేదు. బీసీలకు హక్కుగా రావాల్సిన పథకాల్ని అణగదొక్కారు. రెసిడెన్షియల్ స్కూల్స్, విదేశీ విద్య, బీసీ సబ్ ప్లాన్ ఏవీ లేకుండా చేశారు. బీసీల్ని అన్ని రకాలుగా ద్రోహం చేసి నా బీసీలు అనడంలో అర్థంలేదు. రాష్ట్రం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వక పోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలు ఆగిపోతున్నాయి.

దారుణాతి దారుణంగా దాడులు చేస్తున్నారు
దారుణాతి దారుణంగా దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతోంది. 5 సంవత్సరాలపాటు నిద్రపోయి ఇప్పుడు కులగణన అంటే ఎలా? బీసీలను అణగదొక్కారు. జగన్ మళ్లీ బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. కుల గణన ఇలా కాదు. దానికి ఒక చట్టబద్దత ఉంటుంది. దానికి ఒక కమిషన్ ఉంటుంది. కొందరికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా తీసుకోవాల్సిన సమాచారాన్ని తీసుకోవడంలేదు. బీహార్ లో చేసిన కుల గణన సరైంది కాదని కోర్టు బీహార్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఎన్నికల్లో భయపట్టి గెలవాలని చూస్తున్నారు. బలహీనవర్గాలని మభ్యపెట్టాలని చూస్తే బలహీనవర్గాల ప్రజలు అమాయకులు కారు.

పేద మత్స్యకారుడి మృతికి కారణమైన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
ఇది ప్రభుత్వ హత్యే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొందరు అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే కాలంలో వారికి శిక్ష తప్పదు. ఇందుకు బాధ్యులౌతారు. బీసీ బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించే తొలి ఓటు బీసీలదే అవుతుందని జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

LEAVE A RESPONSE