రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుభాటి పురందేశ్వరి

విజయవాడ… రాష్ట్ర ప్రజలు బిజెపిని ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు . బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జిల్లా సంయోజకులు, ఇన్ ఛార్జిలు రాష్ట్ర స్ధాయి సమావేశానికి పురందేశ్వరి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు సంబందిం చి 175 అసెంభ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబందించిన విషయాలపై అంతర్గతంగా చర్చించుకోవడం జరుగుతోంది. క్లస్టర్ల వారీగా అన్ని అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు. సంక్షేమం పేరుతో ఓటు రాజకీయాలు నడుపుతున్నారు. అభివ్రుద్దిని ఆకాంక్షించేవారికి ఓటు వేయడానికి ప్రజలు సంసిద్దులు కావాలి. కుటుంబ నేపధ్యం లేకుండా గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి పాలన జరుగుతోంది. దేశానికి మంచి పరిపాలన బిజెపి వల్ల అందుతున్న విషయం ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఆయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కుటుంబ నేపేద్యంలేని నిజాయితీ పాలన అందించే బిజెపి ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

అఖిల భారత సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు వేదికను అలంకరించారు.

Leave a Reply