Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరు యార్డ్‌లో పిల్లర్ల దశలో ఆగిన శీతల గోదాముల నిర్మాణం

– శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల
– రైతన్నల అగచాట్లు

మిర్చి పంట గుర్తుకువస్తే వెంటనే గుంటూరు జిల్లా పేరు గుర్తుకు రావడం సహజం. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు, మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి.

పసుపు, మినుము, కందులు పండించే అన్నదాతలదీ ఇదే పరిస్థితి.అయితే నిల్వ చేసేందుకు గోదాములు లేక అన్నదాతలు ఆర్ధికంగా విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, దుగ్గిరాలలో నిర్మాణానికి నిధులు కేటాయించింది.

వీటికి సంబంధించి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం అప్పటి వరకు చేపట్టిన పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో శీతల గోదాముల నిర్మాణం పిల్లర్ల దశలో ఆగిపోయింది.

ఒకవైపు పెట్టుబడులు పెరిగి, మరో వైపు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా ఆగిపోయిన నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.

LEAVE A RESPONSE