Suryaa.co.in

Andhra Pradesh

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

• రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన కోట వెంకటేశ్వరరావు(60).
• వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

• పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన టెక్కం నాగేశ్వరరావు (57).
• నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• టెక్కం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

• పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 05-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మువ్వ సింగారావు (52).
• సింగారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• సింగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

మీతో మేమున్నాం…అధైర్యపడకండి

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం..అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సందర్భంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరుజిల్లాలో పర్యటించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నాలుగు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమానికి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదటగా రేపల్లె నియోజకవర్గానికి చేరుకున్నారు. చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వరరావు(67) మృతిచెందారు. వెంకటేశ్వరరావు భార్య కోట విజయలక్ష్మి, కుమారులు సురేష్, రాజేష్, ఇతర కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షలు చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.

అనంతరం పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త మువ్వ సింగారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 05-10-2023న సింగారావు(52) గుండెపోటుతో మృతిచెందారు. సింగారావు భార్య పార్వతి, తల్లి మస్తానమ్మ, కుమార్తెలు కళ్యాణి, హిమబిందులను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిసాయం చేశారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భువనేశ్వరి నివాళులు అర్పించారు.

అనంతరం పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో పార్టీ కార్యకర్త టెక్కెం నాగేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 10-09-2023న గుండెపోటుతో నాగేశ్వరరావు(57) మృతిచెందారు. నాగేశ్వరరావు భార్య దేవునిదయ, కుమార్తె వెంకటరత్నం, తల్లి నాగరత్నం లను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరావు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.

అనంతరం ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు రూరల్ నియోజకవర్గం, ముక్తినూతలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త సూదనగుంట వెంకటరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 13-10-2023న వెంకటరావు(50) గుండెపోటుతో మృతిచెందారు. వెంకటరావు తమ్ముడు వేణు,తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. మొదటిరోజు కార్యక్రమం ముగిసిన అనంతరం ఒంగోలులోని బృందావనం కన్వెన్షన్ సెంటర్ వద్ద బస చేశారు.

భువనేశ్వరికి వెల్లువెత్తిన మహిళల మద్దతు, సంఘీభావం:
నారా భువనేశ్వరి నిజం గెలవాలి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున భువనేశ్వరికి మద్దతు తెలిపారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాల ఇళ్ల వద్ద మహిళలు పెద్దఎత్తున చేరుకుని భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు.

నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భువనేశ్వరి అభివాదం చేస్తూ ముందుకు కొనసాగారు. భువనేశ్వరితో కరచాలనం చేసి, ఫోటోలు దిగేందుకు పిల్లలు, మహిళలు పెద్దఎత్తున పోటీపడ్డారు.

LEAVE A RESPONSE