15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30వేల రిట్ పిటిషన్లు పడటంపై జగన్ ఏం చెబుతాడు?

• ప్రజలిచ్చిన అధికారం.. ప్రజాధనంతో జగన్ రెడ్డి తన దురుద్దేశాలు, రాజకీయ కక్షసాధింపులు నెరవేర్చుకుంటున్నాడు
• చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది
• ఒకే కేసులో ముద్దాయిలైన ఇద్దరిలో న్యాయస్థానంలో ఒకరికి లభించిన మినహాయింపు, మరోవ్యక్తికీ లభిస్తుందనే చిన్న విషయం, పెద్ద పెద్ద న్యాయనిపుణులు, ప్రజలసొమ్ము జీతంగా తీసుకునే సలహాదారుల సలహాలు వినే జగన్ ప్రభుత్వానికి తెలియదా?
• చంద్రబాబుపై పెట్టిన కేసులు…చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్నైనా జగన్ నిరూపించగలిగాడా?
• చంద్రబాబుని బదనాం చేయడానికి జగన్ తన తండ్రి కంటేఎక్కువగా తాపత్రయపడుతున్నాడు
• నాలుగున్నరేళ్లలో తన ప్రభుత్వంపై 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30వేల రిట్ పిటిషన్లు పడటంపై జగన్ ఏం చెబుతాడు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ రెడ్డి ప్రజాధనంతో తన దురుద్దేశాలు, రాజకీయ కక్షసాధింపు లు నెరవేర్చకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని, పలుసందర్భాల్లో న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీని వాసులు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….

“ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వం ముద్దాయిగా పేర్కొన్న మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుచేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, ఆ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరిం చింది. మరలా ప్రభుత్వం తాజాగా చంద్రబాబునాయుడి ముందస్తు బెయిల్ రద్దుచేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఒకకేసులో ఒక వ్యక్తికి ఒకరకమైన మినహాయింపు లభిస్తే, అదేకేసులో ముద్దాయిలుగా ఉన్నవారికి కూడా వెసులు బాటు లభిస్తుందని కొత్తగా నల్లకోటు వేసుకున్న న్యాయవాది కూడా చెబుతాడు.

పెద్ద పెద్ద న్యాయనిపుణులు, ప్రజలసొమ్ము జీతంగా తీసుకునే సలహాదారుల సలహాలు తీసుకునే జగన్ ప్రభుత్వం, కోట్లాదిరూపాయల ప్రజల సొమ్ముని తన కక్షసాధింపులకోసం న్యాయస్థానాల్లో దుర్వినియోగం చేయడాన్ని ఏమనాలి? ప్రజల్లో టీడీపీ అధినేతను పలుచన చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు వంటి నాయకుడిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న రాజకీయ దురుద్దేశంతోనే ఆయన బెయిల్ పిటిషన్ పై జగన్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. తనకు ఉన్న అధికారం.. డబ్బుతో జగన్ రెడ్డి సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటిచర్యలకు పాల్పడుతున్నాడు.

చంద్రబాబుని బదనాం చేయడానికి జగన్ రెడ్డి, తన తండ్రి కంటే ఎక్కువగా తాపత్రయపడుతున్నాడు
చంద్రబాబునాయుడిపై.. టీడీపీ నేతలపై.. తనకు గిట్టనివారిపై ఈ విధంగా వ్యవహరించడానికేనా ప్రజలు జగన్ రెడ్డికి అధికారమిచ్చింది? ప్రతిపక్షాలే కాదు.. ఉద్యోగులు… ఉపాధ్యాయులు సహా వివిధ వర్గాలకు తాను ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపడం మరోరకమైన దుర్మా ర్గం. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏమైనా ఉందా? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చి, లింగమనేని రమేశ్ కు మేలు చేశారని, తద్వారా ఆ రమేశ్ కు చెందిన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉంటున్నాడని జగన్ అండ్ కో చేస్తున్న నిరాధార ఆరోపణ.

చంద్రబాబు తాను నివాసముంటున్న ఇంటికి ఎప్పటికప్పుడు అద్దె చెల్లిస్తున్నారు. చంద్రబాబుపై రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు జరిపించాడు. చివరకు రూపాయి అవినీతికూడా తేల్చలేక మిన్నకుండిపోయాడు. ఇప్పుడు జగన్ రెడ్డి తండ్రి కంటే ఎక్కువగా చంద్రబాబుని బదనాం చేయడానికి తాపత్రయ పడుతున్నాడు.

తన ప్రభుత్వంపై పడిన కోర్టు ధిక్కరణ కేసులు.. రిట్ పిటిషన్లపై జగన్ ఏం సమాధానం చెబుతాడు?
ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వంపై 15,046 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే, 30వేల రిట్ పిటిషన్లు వేయబడ్డాయి. వీటన్నింటికీ జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన నడుస్తోందని జగన్ చెప్పగలడా? దుష్టపాలన..దుర్మార్గపు పాలన..నియంత్రత్వ పాలన సాగిస్తూ, అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలు, విధ్వంసాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు సహా ఇతర కేసులన్నీ జగన్ రెడ్డి కక్షసాధింపుల్లో భాగంగా పెట్టినవే. చంద్రబాబునాయుడిని అన్యాయంగా 53 రోజులు జైల్లో బంధించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి జగన్ రెడ్డి తన పదవిని, అధికారాన్ని వాడుకున్నాడు.

చంద్రబాబుపై జగన్ రెడ్డి ఎన్నికేసులు పెట్టినా.. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కటీ నిరూపించలేకపోయాడు
రాష్ట్రంలో అరాచక రాజ్యం తప్ప.. ఏ రాజ్యం లేదు. జగన్ రెడ్డికి ఇంకా 71 రోజుల సమయం ఉంది. తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. చంద్రబాబుపై ఈ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కటీ నిరూపించలేకపోయాడు. తప్పుచేయని చంద్రబాబు ఎవరికీ భయపడ డు. చంద్రబాబుపై చేసినవి ఆరోపణలు కాబట్టే… ఒక్కదాన్ని కూడా జగన్ రెడ్డి నిరూపించలేకపోయాడు.

12 కేసులు మోపబడిన జగన్ రెడ్డి, రూ.43 వేలకోట్ల ప్రజలసొమ్ము దోచుకున్నాడని సీబీఐ, ఈడీలే తేల్చాయి. చంద్రబాబు దుర్మార్గు లపై పోరాడుతున్నాడు కాబట్టే, ఆయన సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆయన్ని అభిమానిస్తూ.. ఆదరిస్తున్నారు.” అని కాలవ చెప్పారు

Leave a Reply