Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లలో బీసీలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

-బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం
-వైసీపీ పాలనలో వారికి తీరని అన్యాయం
-పథకాలు పునరుద్ధరిస్తాం
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-పద్మశాలీయులతో ఆత్మీయ సమావేశం

బీసీలకు మేలు చేసేది…చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లిలో గురువారం పద్మశాలీయ బహుత్తమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు మేలు జరిగింది లేదు..అభివృద్ధి లేదు. పైగా ప్రశ్నించినందుకు బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు. బీసీలకు మేలు జరగాలన్నా…బీసీలు అభివృద్ధి చెందాలన్నా అది కూటమితోనే సాధ్యమన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4000 పెన్షన్‌ అమలు చేస్తామని, బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో సహకారం అందించి అభివృద్ధిలో నడిపిస్తామని చెప్పారు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించి పథకాలు అన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE