Suryaa.co.in

Andhra Pradesh

ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారు

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

పోలీస్ & డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కలిసి ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారని *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …

టీడీపీకి చెందిన నాయకుల కంపెనీలపై దాడులు చేయించడం జగన్ కు అలవాటు
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) ద్వారా రాజకీయ ప్రత్యర్థుల కంపెనీలపై జగన్ అండ్ కో దాడులు చేయించి కోట్లు దోచుకుంటున్నారు. అధికారికంగా కోట్లు దోచుకోవడానికి, సొంత ఖజానా నింపుకోవడానికే జగన్ కొత్త విధానాలు అవలంబిస్తున్నారు. ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) జీఎస్టీ, పన్నులు కడుతున్నారా లేదా విచారణకై ప్రతి స్టేట్ లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. జగన్ దీన్ని సొంత ఖజానా నింపుకోవడానికి ఉపయోగించుకున్నాడు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటుకు చెందిన రాజేశ్వర్ రెడ్డి అనే బంధువును జగన్ డీఆర్ఐ స్పెషల్ కమిషనర్ గా నియమించుకున్నారు. అతని సహకారంతో కోట్లు దండుకుంటున్నారు. పాత పుస్తకంలో ఎవరో ఏదో రాశారని, దాన్ని ఎన్నికల్లో డబ్బులు పంచినట్లుగా చిత్రీకరించి ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసు నమోదు చేసింది నిజం కాదా? దొంగ ఓట్ల భాగోతం బయట పెట్టినందుకు ఏలూరి సాంబశివరావుపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

ఏలూరి ఎప్పుడో వదిలేసిన కంపెనీల్లో ఏదో ఉందని దాడులు చేస్తున్నారు. ఇదంతా జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగమే. దొంగ ఓట్ల నమోదులో నలుగురు ఎస్ ఐలను సస్పెండ్ చేయించారనే కక్ష, ఈర్ష్యతో ఏలూరి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయించారు.

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరి నోరు విప్పాలి
రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరి ఈ విషయంలో సమాధానం చెప్పగలరా?, రాజేశ్వర్ రెడ్డి కమిషనర్ గా డీఆర్ఐ చర్యలపై ఎందుకు పై అధికారులు మాట్లాడటంలేదు? జగనేమో నాకు సాక్షితో సంబంధం లేదంటాడు, షర్మిల నాకు, అన్నకు సగభాగం సంబంధముందంటున్నారు. ఏది నిజం? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన వైట్ & బ్లాక్ అమౌంటుపై ఒక శ్వేతపత్రం విడుదల చేయగలిగే దమ్ము డీఆర్ఐకి ఉందా?

రాజేశ్వర్ రెడ్డి ఎందుకు జగన్ కు ఇంతలా దాసోహం చేస్తున్నారు? షర్మిలకు జగన్ భాగోతం అంతా తెలుసు, గుట్టంతా షర్మీలా చేతిలో ఉంది. ఆమె గుట్టు విప్పితే జగన్ జైలుకు పోవడం ఖాయం. ఐదున్నర సంవత్సరాలుగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులతో అఖిలపక్ష పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

ప్రజల ఉపయోగార్థం ఉన్న రంగాలు దుర్వినియోగం
రాష్ట్ర ఖజానాను నింపడానికి, ప్రజలకు ఉపయోగపడటానికి పనిచేయాలన్సిన సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ తన స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నాడు. పన్ను ఎగవేతదారుల జుట్టు పట్టుకొని వసూలు చేయాల్సిన వ్యక్తి రాజేశ్వర్ రెడ్డి జగన్ కు జీ హుజూర్ అంటున్నారు. వసూలు చేసిన డబ్బును ప్రభుత్వ ఖజానాకి జమ చేయాల్సివుండగా చేయటంలేదు. ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటులో పనిచేస్తూ డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చారు. గతంలో డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.

కానీ జగన్ తన బంధువు అయిన రాజేశ్వర్ రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. జగన్ కు బంధువు అవడమే దీనికి కారణం. జగన్ సూచించిన వ్యక్తులు, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు, జగన్ కు చెందిన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారు, రామోజీరావుకు చెందిన మార్గదర్శి, గల్లా జయదేవ్ లాంటి కంపెనీలు అన్నింటిపై దాడులు చేస్తారు. నోటీసులు ఇస్తారు. జీఎస్టీ ఎగ్గొట్టారని, పన్నులు ఎగ్గొట్టారని దాడులు చేస్తారు.

కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఖజానాకు ఎంత ఇచ్చారు?
రాజేశ్వర్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎంత వసూలు చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేశారు? అసలు విధి నిర్వహణ సక్రమంగా చేశారా? మీరు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారో తెలపాలి. ముఖ్యమంత్రిని, రాజేశ్వర్ రెడ్డిని అనుమానిస్తున్నాం.

వారు కలెక్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన డబ్బులపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి తన వ్యక్తి గత ఖాజానాను నింపుకున్నాడని మేమంటున్నాం. కాదని మీరనగలరా? ఎవరెవరి కంపనీలు రైడ్ చేశారు. ఎవరెవరి కంపెనీలు తనిఖీలు చేశారో తెలపాలి. మీకొచ్చిన ఫిర్యాదులు తెలపాలి. స్పషల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వివరాలివ్వాలి.

ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసు కక్ష సాధింపు కాదా?
జగన్ చెబితేనా ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసు బనాయించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు ఆయనకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ.. ఆటోలకు 50 వేలు, బస్ ఛార్జీలు 50 వేలు, సాధారణ ఖర్చులు 50 వేలు అని రెండున్నర లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసి పెట్టుకుంటే ఆ స్లిప్పు పట్టుకొని తాజాగా ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా? ఎలక్షన్ లో డబ్బు పంచాడని రాజేశ్వర్ రెడ్డి ఒక నిర్ధారణకు వచ్చి లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు.

దొంగ ఓట్ల బండారం బయట పెట్టినందుకే ఏలూరి పై దాడి
జగన్ దొంగ ఓట్ల బండారం అంతా ఏలూరి సాంబశివారెడ్డి బయట పెట్టాడు, అతన్ని వదలొద్దని జగన్ రాజేశ్వర్ రెడ్డికి చెబితేనే ఏలూరి సాంబశివారెడ్డిపై దాడి చేశారు. ఏలూరి సాంబశివారెడ్డి వద్ద దొరికిన స్లిప్పుకి ఎలక్షన్ క్యాంపెయిన్ కి కనెక్ట్ చేసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలిగానీ, , ఎస్పీకి ఫిర్యాదు చేయడమేంటి? ఎస్పీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణకు పర్మిషన్ ఇచ్చింది. దాన్ని రాద్దాంతం చేస్తున్నారు.

‘సాక్షి’ వార్త పత్రిక కాదు, జగన్ కరపత్రం
సాక్షి అనే చెత్తపేపర్ లో అన్నీ జగన్ కు అనుకూలంగానే వస్తాయి. అయినా జగన్ సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదంటాడు. నాకు పేపరే లేదంటాడు. సాక్షి ఛానల్ నాది కాదంటాడు, నాకు ఏ ఛానల్ లేదంటాడు. కానీ ఆ ఛానల్ పెడితే జగన్ ముఖమే చూడాల్సి వస్తుంది. సాక్షి పత్రిక తిరగేస్తే అన్నీ జగన్ వార్తలే ఉంటాయి.

జగన్ కు చెందిన సాక్షి చెత్త పేపర్ లో వర్ల రామయ్య ముఖం చూడదలచుకోలేదు. నా ఫొటో వేయమని ఎప్పుడూ సాక్షికి రిక్వెస్ట్ చేసుకోను. రాజేశ్వర్ రెడ్డి లాంటి అవినీతి అధికారుల్ని వదిలేది లేదు. టీడీపీ తరపున న్యాయ పోరాటం చేస్తాం. అక్రమాల్ని ఎండగడతామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE