Suryaa.co.in

Telangana

మెడికల్, నర్సింగ్ కళాశాలల హాస్టల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

* సంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

సంగారెడ్డి: మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల లోని హాస్టల్స్ నిర్మాణ పనులు వెంటనే పూర్తీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య, ఆరోగ్య , ఇంజనీరింగ్ శాఖ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో DMHO, TGMSIDC ఇంజనీరింగ్ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సంబంధిత శాఖల అధికారులతో వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు , నిర్మాణం పనుల పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల నిర్మాణం, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అందోల్ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణంతో పాటు విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఆందోల్ ను మెడికల్ హబ్ గా రూపొందించడంలో భాగంగా వట్పల్లి, కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం పనులు వెంటనే పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనుల లో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని , వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE