Suryaa.co.in

Andhra Pradesh

విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించండి

డబ్ల్యుఇఎఫ్ న్యూఎకానమీ ఆపరేషన్స్ హెడ్ శ్రీరామ్ గుత్తాతో లోకేష్ భేటీ

దావోస్: వరల్డ్ ఎకమికమిక్ ఫోరం న్యూఎకానమీ, సొసైటీ విభాగం ఎంగేజ్ మెంట్ & ఆపరేషన్స్ విభాగం హెడ్ రవి గుత్తాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం మద్దతునివ్వండి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో గ్లోబల్-స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించడానికి సహకారం అందించండి. డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆంధ్రప్రదేశ్‌ని విద్యాపరమైన ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ప్రోత్సహించడంలో సహకారం అందించండి.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా విద్య, మానవ మూలధనం అభివృద్ధిలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పాలని నిర్ణయించాం. భవిష్యత్ నైపుణ్యాలు, అభ్యసనా పద్ధతులు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై ప్రత్యేకంగా దృష్టిసారించాం. విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి ఎఐ, డిజిటల్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతకతలు వినియోగిస్తున్నాం. పరిశ్రమ సంబంధిత అధునాతన శిక్షణ కోసం ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయండి.

రవి గుత్తా మాట్లాడుతూ… భారతదేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మేం చురుగ్గా పాల్గొంటున్నాం. బోధన, అభ్యాసం కోసం ఎఐ వినియోగంలో భారత్ కు మద్దతుగా నిలుస్తాం. భవిష్యత్ మార్కెట్ల కోసం శ్రామికశక్తిని సిద్ధం చేయడంలో భారత సంస్థలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE