Suryaa.co.in

Andhra Pradesh

బర్త్ డే రోజున కూడా పెట్టుబడుల వేటలోనే మంత్రి లోకేష్!

– హ్యాట్సాఫ్ అంటూ ఇతర రాష్ట్రాల ప్రతినిధుల అభినందనలు

దావోస్: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు దాదాపు ఏడాదిపాటు యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి విజయం సాధించిన పోరాట యోధుడు నారా లోకేష్. ఈరోజు ఆయన పుట్టినరోజు. తన బర్త్ డే అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా దావోస్ లో పెట్టుబడుల వేటలో మునిగిపోయారు. ఈరోజు కూడా ఉదయం నుంచే దావోస్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అధికారం చేజిక్కింది కదా అని ఆడంబరాలకు పోలేదు. 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విరామం లేకుండా పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రి లోకేష్ పడుతున్న తపనను దావోస్ లో ప్రత్యక్షంగా చూస్తున్న ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హ్యాట్సాఫ్ యువర్ ఎఫర్ట్స్ అంటూ అభినందనలు చెబుతున్నారు.

LEAVE A RESPONSE