దోషులను దాచిపెట్టెందుకేనా.. ఎదురుదాడి…?

– ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంతోనే కోలుకోలేనంత నష్టం..!
– కేటీఆర్ నిశబ్ద మద్దతుతోనే వరుస ఘటనలు..!
– బాలిక అత్యాచార దోషులెక్కడ..?
– “హిందూ గుళ్ళు బొందు గాళ్లు ” అన్నప్పుడు మతసామరస్యం గుర్తు రాలేదా… కేటీఆర్ సార్..?
– ఎదురుదాడి సరే.. బాధితులకు న్యాయం ఏది..?
– ఇంత టెక్నాలజీ నగరంలో నిందితుల జాడేది..?
– మోడీ గారిని ప్రశ్నించడం గురువింద నీతులే..

“నవ్వి పోదురుగక.. నాకేంటి సిగ్గు”అనే రీతిలో వ్యవహరిస్తున్నారు T R S కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఇటీవల కాలంలో మజ్లిస్ పార్టీ మెప్పుకోసం.. ఆ వర్గం ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో హిందువులను అవమానించే పనిలో పడ్డారు. దేశంలోనే అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకు వెళ్తున్న భాగ్య నగరం నడిబొడ్డున ఓ బాలిక అఘాయిత్యానికి గురై పది రోజులు గడిచినా నిందితులను పట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన టెక్నాలజీ సేవలందిస్తోంది. నగరం నిండా సీసీ టీవీ కెమెరాలు ఉన్నా సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయి. ఇదే కాదు వరుస ఘటనలు చోటుచేసకుంటున్నా పాలకులు.. అధికారులు ..పోలీసు యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదు. పైగా నిందితులను రక్షించే పనిలో రక్షకభటులు క్షణం తీరిక లేకబిజీగా ఉన్నారు. ఇంత జరుగుతన్నా ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు. ఇది మరీ దారుణం. మరి యువరాజు కేటీఆర్ మాట్లాడుతారనుకుంటే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను మరిపించేందుకు.. ప్రజల ఆలోచనను మళ్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకు సొంత రాష్ట్రంలోనీ సమస్యలు వదిలేసి, సంబంధం లేని విషయం గురించి ప్రధాని నరేంద్రమోడి గారినీ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తున్న పని మాత్రమే!

” ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని బిజెపి నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందుకు ఆ పార్టీ నేతలు అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లను పార్టీ నుంచి బీజేపీ తొలగించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రధాని మోదీ గారికి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మోదీజీ…మీ పార్టీ నేతల విద్వేష ప్రసంగాలపై మీరు కొనసాగిస్తున్న మౌనం దేశానికి కోలుకోలేనoత నష్టం చేకూరుస్తుంది అని పేర్కన్నారు. ఇలాంటి సందర్భాలలో బిజెపి అగ్రనేతలు నుంచి వస్తున్న నిశబ్ద మద్దతుతో దేశంలో మతోన్మాదం, విద్వేశాన్ని పెంచుతుందని చెప్పారు. ఈ పరిణామాలు భారత్ కు కోలుకోలేనివిధంగా నష్టాన్ని చేకూరుస్తాయి అని కేటీఆర్ మోదీనీ ఉద్ధేశించి ట్వీట్ చేశారు.

…….మరి ఇవన్నీ బాగానే చెప్తున్నారు. “హిందూ గుళ్ళు బొందు గాళ్లు” అని నిండు సభలో తెలంగాణ సాక్షిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కెసిఆర్ గారు విమర్శిస్తుంటే ఎందుకు స్పందించలేదు? కెసిఆర్ మాటలకు చప్పట్లు కొట్టి .. ఈలలు వేసి కేరింతలు కొట్టారు.. తప్ప ఒక మతాన్ని విమర్శించడం సరి కాదు అని ఎవరు గ్రహించలేదు.

బైంసా లో అల్లర్లు జరిగితే చిల్లర గాళ్ళకు గొడవ అని సర్ది చెప్పారు. బైంసాలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు సిద్దు పై ఎందుకు కేసు పెట్టారు.? బైంసా ఘటనను చాలా ఈజీగా తీసుకొని కేసులన్నీ హిందువుల పైనే పెట్టారు. నేటికీ అనేక ప్రాంతాల్లో హిందువులపై దాడులు.. అత్యాచారాలు … భూకబ్జాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న అదిలాబాద్ జిల్లా తలమడుగు ప్రాంతంలో రైతుల భూమిని కబ్జా చేసుకునేందుకు వస్తే తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. కొడుకు నిలకడగా ఉన్నారు. ఇవన్నీ మీ అండదండలతో జరిగిన పనులు కావా..? మీ మద్దతు లేకపోతే మెజార్టీ వర్గంపై మైనార్టీలు దౌర్జన్యం చేసే ధైర్యం ఎక్కడిది..?

అంతకుమించి రాష్ట్ర రాజధానిలో పది రోజులుగా ఓ బాలిక అత్యాచారం విషయం గగ్గోలు పెడుతుంది. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అనడంలో తప్పేముంది..? “పోకిరిగాళ్ళు ఆడపిల్లల వైపు చూస్తేనే కళ్ళు పీకేస్తా “అని హెచ్చరించిన కెసిఆర్ సార్ ఈ మహా నగరంలో జరిగిన ఘటన పై మౌనం ఎందుకువహిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో కేసీఆర్ నుంచి వస్తున్న నిశ్శబ్ద మద్దతు తెలంగాణ రాష్ట్రంలో హత్యలు ..అత్యాచారాలు.. భూకబ్జాలను ప్రేరేపించదా..? కెసిఆర్ మరియు కె టి ఆర్ మౌన దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి కోలుకోలేనంతగా నష్టాన్ని చేకూరుస్తాయి కదా. “శకునం పలికే బల్లి కుడితిలో పడ్డట్టు” ప్రపంచ మానవాళి సంక్షేమం కోరే తారక రామారావు గారు అమ్నేసియ ఘటనపై ఎందుకు నోరు విప్పడం లేదు.

ఇవన్నీ గురువింద నీతులు కావా..? “తన కింద ఉన్న నలుపును దాచిపెట్టి , ఇతరులను వెక్కిరించినట్టు ‘రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలేసి మోడీ గారిని విమర్శించడం గురివింద చర్యలే..!

అంటే ఇక్కడ బెంజ్ కారు (ఓటు బ్యాంకు.. పలుకుబడి గల నేతల కుమారులు)కు సాధారణ ఆటో రిక్షా (ఓటుకు విలువ లేని.. పలుకుబడి లేని నిరు పేదలు)కు జరుగుతున్న పోరాటం ఇది. తన దారిలో తాను వెళుతున్న ఆటో రిక్షాను వెంబడించి ఢీ కొట్టిన బెంజ్ కారు దర్జాగా తిరుగుతోంది. ఎదురెదురుగా ఢీకొనడం వేరు..! వెంబడించి మరీ వెనకాల నుంచి ఢీ కొట్టిన కారుది ఇక్కడ తప్పు కనిపించడం లేదు. అదేదో సినిమాలో “గిల్లితే గిల్లిచ్చుకోవాలి.. తంతే తన్నులు తినాలి” అన్నట్టు సాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో పాలన.

ఈ ఘటనను మరిపించేoదుకు ఎదురు దాడి చేసి.. తారుమారు చేయాలనుకున్న సాక్షాలను బయట పెట్టినందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు పెట్టడం ఘోరాతి ఘోరం. అధికారం ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుంది అనే భావనలో ఆకాశాన్ని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం తలదించి నేలను చూసి నడుచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటన దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెలో.. తండా తండాలో పొలాల దగ్గర పని చేసుకునే ఆడపడుచులు సైతం చర్చించుకుంటున్నారు. దోషులను తప్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపితే.. వరుస ఘటనలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజానీకం 2024 లో అధికార మదాన్ని దించేందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పటినుంచే ఎదురుచూడక తప్పదు. “మీరు విసిరే తాయిలాలకు ప్రలోభపడి రజాకార్లను ప్రోత్సహించే కారుకు మద్దతిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు” అనే విషయాన్ని వివేకంతో ఆలోచించాలి.

భవదీయ
పగుడాకుల బాలస్వామి
ప్రచార సహ ప్రముక్
(రాష్ట్ర అధికార ప్రతినిధి) విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ
9912975753
9182674010

Leave a Reply