రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

-జూబ్లిహిల్స్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలి
-హైకోర్టు ఎదుట బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదుల ధర్నా

• రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

• అకృత్యాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

• జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

• బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్, జాయింట్ కన్వీనర్ గోకుల్ రామారావు, ఆంటోనిరెడ్డి, కరుణాసాగర్, జనార్థన్ గౌడ్, ప్రసన్న, శారద తదితరులు పాల్గొన్నారు.