దైవ దర్శనానికి వెళ్తూ.. దంపతులు మృతి

Spread the love

– వరంగల్ కాశీబుగ్గలో విషాదం
– మానకొండూరు వద్ద కారును ఢీ కొట్టిన లారీ
– కారులో ఉన్న వారిలో భార్యాభర్తలిద్దరు మృతి
– వేములవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం

వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరింది. మార్గమధ్యంలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న కాశీబుగ్గ వాసుల్లో ఇద్దరు మరణించారు. మృతులు కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్ గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న మరో ఇద్దరు మేఘన, అశోక్ గాయపడ్డారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. మేఘన అశోకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు‌ ఈ సమాచారం తెలియడంతో కాశిబుగ్గలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Leave a Reply