– “నటి సాయిపల్లవి చట్ట వ్యతిరేకంగా మాట్లాడారు” కాబట్టి, శిక్ష అనుభవించి తీరాల్సిందే..!
– ప్రకాష్ రాజును ఓడించింది హిందూ ఐక్యతే..!
– “గద్దల కొండ గణేష్” పేరుకు బజరంగ్ దళ్ ఉద్యమమే కారణం..!
చట్ట విరుద్ధంగా మాట్లాడి.. చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం కూడా నేరమే. తాను చేసిన తప్పును దిద్దుకోవాల్సింది పోయి నటి సాయి పల్లవి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో హైకోర్టు ఆమెకు అక్షింతలు వేసింది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల హిందువుల మనోభావాలు గాయపరుస్తూ.. గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడిన ప్రముఖ నటి సాయి పల్లవి పై బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయి పల్లవికి నోటీసులు అందించారు. అయితే తనకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో ఆమె మాట చెల్లలేదు. జస్టిస్ లలిత ధర్మాసనం గురువారం వాదోపవాదాలు విని, సాయి పల్లవి పిటిషన్ ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. “ఇది బజరంగ్ దళ్ విజయం”గా పరిగణించవచ్చు. అయితే సాయి పల్లవి తనకు వచ్చిన నోటీసులు తీసుకొని ప్రకాష్ రాజు దగ్గరికి వెళ్లాల్సింది. ప్రకాష్ రాజు స్పందిస్తూ విశ్వహిందూ పరిషత్ పై యుద్ధానికి వచ్చేవాడు.. సమస్య పరిష్కారం అయ్యేది. కానీ పాపం హైకోర్టుకు వెళ్ళింది..!
కాశ్మీర్ లో లక్షలాదిమంది మహిళలపై ఉగ్ర మూకలు అత్యాచారాలు చేసి.. హత్యలు చేస్తే, సాటి మహిళగా సాయి పల్లవి స్పందించిన తీరు గర్హనీయం. మానవ హక్కులు ఉల్లంఘించి, పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆడ మగ తేడా లేకుండా ఊచ కోత కోసిన ఉగ్రవాద మూకులను సమర్థించడం జిగుప్సాకరం.! హిందువులందరినీ వెంబడించి, ఆటవికంగా వేటాడిన నర హంతకులు చేసిన పని సరైనదే అంటూ కితాబిస్తూ.. తాను కూడా ఒక ఉగ్రవాదిలా సాయి పల్లవి మాట్లాడడం చట్ట ప్రకారం నేరం.
అందుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే..!
సెలబ్రిటీ స్థానంలో ఉండి ఏ విషయంలో స్పందించాలి.. ఎంత మేరకు స్పందించాలో ఇంకిత జ్ఞానం ఉండాలి. కానీ వయసుకు మించిన వ్యాఖ్యలు చేయడం.. ముఖ్యంగా సంబంధం లేని రంగాల గురించి మాట్లాడటం.. పబ్లిసిటీ పెంచుకునేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరీ దుర్మార్గం..! ఏది ఏమైతేనేమి చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిందే అది మంచైనా చెడైనా..!
సంఘటితమైన హిందూ సమాజం
ఇటీవల కాలంలో తన “విరాట పర్వం” సినిమా ప్రమోషన్ విషయంలో ఇంటర్వ్యూ ఇస్తూ హిందువులను అవమానపరిచే విధంగా.. ప్రధానంగా గోరక్షకులను ఉగ్రవాదులతో పోలుస్తూ నటి సాయి పల్లవి మాట్లాడిన తీరు పై యావత్ హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు తగిన బుద్ధి చెప్పాలని.. అందుకు ఆమె నటించిన సినిమాలు బహిష్కరించాలని హిందూ వాదులు ఎవరికి వారు నిర్ణయించుకున్నారు. దీంతో విరాటపర్వం ఘోరంగా బోల్తా కొట్టింది. కలెక్షన్లు రాక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అయితే కొంతమంది హిందూ వ్యతిరేకులు.. కమ్యూనిస్టు భావజాలం గలవారు సాయి పల్లవికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. అలా చేయడంతో వ్యతిరేకత మరింత పెరిగింది. ఫలితంగా భరించలేని నష్టం జరిగిపోయింది. ఆ సందర్భంలో ఏ నోట విన్నా ఇదే చర్చ జరిగింది. కొంతమంది సినిమా పెద్దలు, నిర్మాతలు ఇకనుంచి ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతగా రాజకీయాలు ఇష్టం ఉంటే దర్జాగా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవాలి. కానీ.. ఇలా ఇండస్ట్రీని ఇబ్బందులు పెట్టే పని చేయరాదని హితవు పలికినట్టు కూడా తెలిసింది. ఒకరిద్దరు ప్రముఖ దర్శకులు విశ్వహిందూ పరిషత్ పెద్దలతో మాట్లాడుతూ ఆమెను మా సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము అని కూడా చెప్పారు.
“మెగా” ఫ్యామిలీని వదలని హిందూ ఐక్యత..!
… అయితే ఇటీవల కాలంలో జరిగిన “మా” ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ మెగాస్టార్, పవర్ స్టార్ ఓవైపు.. మంచు విష్ణును సపోర్ట్ చేస్తూ మోహన్ బాబు, నరేష్ లు మరోవైపు రెండు ప్యానెల్స్ గా ఏర్పడి రసవత్తర పోటీ జరిగింది. ఆ సందర్భంలో వాతావరణం రాజకీయ ఎన్నికలను తలపించింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి కాబట్టి, ఎలాగైనా అతను గెలవకూడదని ప్రతి హిందూ వాది సంకల్పించాడు. సినిమా రంగంలో తనకు పరిచయమున్న వాళ్లను స్వయంగా కలిసి, లేక ఫోన్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలో ప్రకాష్ రాజును ఓడించాలి. అవతలి వారు ఎవరు గెలిచినా పరవాలేదు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఓడిపోవాలి అని ఎవరికివారు హిందూ వాదులంతా తీవ్రంగా శ్రమించారు. “మెగా” ఫ్యామిలీ దగ్గరుండి ప్రకాష్ రాజును తలకెత్తుకున్న కూడా హిందుత్వం కారణంగా మంచు విష్ణు విజయం సాధించాడు. ఇది హిందుత్వ వాదుల విజయం. ఆ విజయంతో ప్రతి హిందువు ఎంజాయ్ చేశాడు. అంటే నేడు సమాజంలో హిందుత్వవాదం బలంగా పెరిగిపోయిందనేది దీనికి సంకేతం. చిరంజీవి మద్దతు ఇచ్చినా ప్రకాష్ రాజ్ ఓడిపోయాడంటే… రేపటి రోజు చిరంజీవి కూడా హిందుత్వాన్ని చిన్నచూపు చూస్తే హిందూ సమాజపు యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అనేది ఇక్కడ సారాంశం.
……అంతకుముందు “గద్దల కొండ గణేష్” అనే సినిమా విషయంలో బజరంగ్దళ్ ఉద్యమానికి దిగింది. వాస్తవానికి “మెగా” బ్రదర్ లో ఒకరైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా వివరాలు తెలుసుకోవాలి.!
అసలు గద్దలకొండ గణేష్ అనే పేరు ఆ సినిమాకు ఎలా వచ్చిందంటే… గద్దలకొండ గణేష్ కు ముందు ఆ సినిమా పేరు “వాల్మీకి” అని పెట్టారు. అయితే పేరేమో వాల్మీకి.. అందులో హీరో రోల్ మాత్రం రౌడీగా ఉంటుంది. దీంతో సెన్సార్ బోర్డు కు బజరంగ్ దళ్ అబ్జెక్షన్ తెలిపింది. అప్పటి బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ నేతృత్వంలో ఫిలింఛాంబర్, దగ్గర సెన్సార్ బోర్డు దగ్గర బజరంగ్ దళ్ ఆందోళన నిర్వహించింది. రామాయణం రాసిన వాల్మీకి పేరును ఒక రౌడీ పాత్ర పోషించే సినిమాకు ఎలా పెడతారని నిలదీసింది. మీరు పెట్టే పేరు..సినిమాలో ఉన్న తీరు రెండింటికి పోలిక లేదని, వెంబడే పేరు మార్చుకోవాలని సూచించింది. లేదంటే సినిమాను అడ్డుకొని తీరుతామని, అందులో నటించే హీరోతోపాటు దర్శకనిర్మాతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించింది. దీంతో సినిమాకు సంబంధించిన దర్శకనిర్మాతలు, ఇతర పెద్దలు దిగి వచ్చారు. ఆలోచించి పేరు మార్చారు. “వాల్మీకి” పేరు కు బదులు “గద్దలకొండ గణేష్” గా పేరు మార్చారు. ఇది అసలు విషయం.
సెలబ్రిటీలు అయినంత మాత్రాన హిందూ సంస్థలను అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకోలేము. ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను తమ ఆరద్యంగా పూజిస్తాము. గోరక్షణకు ఎంతవరకు అయినా పోరాడుతాము తప్ప చూస్తూ ఊరుకోము. మేము చేసే పోరాటం చట్ట పరిధిలో, చట్టపరంగానే ఉంటుంది.
“గో రక్షకులు ఉగ్రవాదులు కాదు.. ముక్కోటి దేవతలకు విలువైన గోవును కాపాడే ధర్మ పరిరక్షకులు.” ఈ వాస్తవాన్ని నటి సాయి పల్లవితో పాటుఅందరూ గమనించాలి.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ
9912975753
9182674010