విజయవాడ : ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్, ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి గా విజయవాడకు చెందిన గద్దె తిలక్ ఎన్నికయ్యారు.
గురువారం గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 25 మందిని నూతన కార్యవర్గంలోకి తీసుకోగా, అందులో గద్దె తిలక్ కు ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఆయనకు ఈ పదవి దక్కటం ఇది రెండవసారి. ప్రధాన కార్యదర్శి పదవితొ పాటు, ఉపాధ్యక్ష పదవి కూడా విజయవాడకు చెందిన పర్వతనేని ప్రసాద్ కు దక్కింది.
ఈ సందర్బంగా గద్దె తిలక్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు తన శక్తిమేర పనిచేస్తానన్నారు. 2025 ఆర్ధిక చట్టంలోని పెన్షన్ సవరణలు పెన్షనర్లపై ప్రతి కూల ప్రభావం చూపిస్తుందని, అందుకు ఆంధ్రప్రదేశ్ లోని 13 ప్రభుత్వ శాఖల పెన్షనర్ల సంఘాలతొ చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై సమిష్టిగా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి పదవి దక్కటం పట్ల గద్దె తిలక్ ను పలువురు అభినందించారు.