గంధం భువన్ కు దళిత చైతన్య స్రవంతి అభినందనలు

యూరోప్ ఖండంలో 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎలెబ్రెస్ ని అతి పిన్న వయస్కుడు గంధం భువన్ జై ను దళిత చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక చౌదరయ్య పాఠశాల ను ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు IAS గారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భువన్ ను పర్వతారోహణ రంగoలో ప్రోత్సాహం అందిస్తున్న గంధం చంద్రుడ్ని సన్మానించారు. అనంతరం ఆయన కు భారత రాజ్యాంగం పుస్తకం వారు అందచేశారు. దళిత


యువత , ఉపాధి అవకాశాలు పై దళిత చైతన్య స్రవంతి నాయకులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో దళిత చైతన్య స్రవంతి అధ్యక్షుడు నల్లపుకోటేశ్వరరావు, కార్యదర్శి యడ్ల వినీల్, సభ్యులు బత్తుల విక్రమ్, కొప్పుల సిద్దు, షేక్ ఖళీళ్, జై భీమ్ సంస్థ అధ్యక్షుడు, నీటి పారుదల శాఖ అధికారి దాసరి చెన్నకేశవులు, మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తో పాటు పలువురు అభ్యుదయవాదులు పాల్గొన్నారు.