Suryaa.co.in

Features

నా రంగి బాగుందా ?

వరి చేలో నా రంగి
వడ్డాది పాపయ్య గారి చిత్రానికి నా పాట
మూలం: ఎంకి పాటలు , శ్రీ నండూరి సుబ్బారావు
పేరడీ కాదు , నా స్వంతమే
రంగి రాకే నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
గుళ్ళో భక్తుడై నిను కొలిచేనే
వొళ్ళొ బిడ్డల నేనొదిగేనే
కంట సూత్తె సాలు
ఒంటొ సెమటలె సెమటలు
రంగి రాకే నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
పంటచేలొ నువ్వు పరిగెలేరుతుంటె
వంగి వోరకంట నన్ను సూత్త ఉంటె
నీ గుబ్బ గుబ్బ నడుమ
నా గుండె సికుకుంటె
రంగి రాకె నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
నీ గుబ్బ తాకిడికి
నా గుండెగిసి పడితె
నా గుండె సప్పుడికి
నీ గుబ్బ లెగిసి పడితె
రంగి రాకె నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
వరిసేలొ కంకులు
వాయిద్యమయెనాడ
గాలి దేవుడు కూడ గుబ్బ బిగుతులు సూడ
కంకులా మూటలు గలగలా గలా పాడ
రంగి రాకె నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
నా మనసు సెదిరి పోయె
ఎలుతురేమొ ఆరిపోయె
గుబ్బల మద్దెన గుండె సిక్కి పోయె
గుండె లేని నే బండగ మారిపోయె
రంగి రాకె నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ
ఒంటిగీ సీకట్లొ
ఇంటీకి పోలేను
నా గుండె కాడ సేర్చి
పున్నెం కట్టుకొను
రంగి రాకె నాకు వరమోయీ వరమోయీ
రాకపోతే నాకు దిగులోయీ దిగులోయీ

– నీలంరాజు చంద్రమోహన రావు

LEAVE A RESPONSE