Suryaa.co.in

Features

వజ్రోత్సవమిది..

అజాదీ కా అమృతోత్సవమై మెరిసే..
నీలి గగనం పుష్పామృతమై కురిసే..
పురుడు పోసిన నేల పరవశమై మురిసే..
డెబ్బైఐదేళ్ల అమృతోత్సవమిది..
భరత మాతకు బ్రహ్మోత్సవమిది..

హర్ ఘర్ తిరంగా అంటూ..
ప్రతి ఇంటిపై ప్రతి గుండెపై..
భారత శాంతి కపోతం ఎగరే..
అమృతోత్సవమిది..

వజ్రోత్సవమిది..
కణం కణం భరతమాతకు..
సమర్పణమంటూ..
సర్వాన్ని అర్పించిన..
మహనీయులు త్యాగధనుల..
కీర్తిని చాటే సమయమిది..
అమరుల పాదాలు స్పృశించి..
అశృవులతో అభిషేకించే..
అమృతోత్సవమిది..

గాంధీ తిప్పిన చట్రం..
అశోకుడి ధర్మ చక్రం..
సుభాషుడి చేతి ఖడ్గం..
వివేకుని ధర్మ మార్గం..
వందేమాతర నినాదం..
మహనీయుల బాటే విధానం..
ఇవే మన జాతికి ఆదర్శం..
ఇదే తల్లి భారతీ దర్శనం..
ఇదే స్వాతంత్ర్యానికి నిదర్శనం..

పయోదం దాటి ఎగిరే జెండా..
దేశ ప్రగతికి అమృత భాండా..
ధర్మం కర్మం మోక్ష సాధన..
వేదభూమి వెదజల్లిన బోధన..
లోకహిత సోదర భావన..
సత్యం శాంతి కారుణ్యమృత గగన..
సిరులను తరులను మోసిన అవని..
త్యాగపునాదుల దాచిన పావని..
స్వాతంత్ర్యానికి పండుగ కాదిది..
సమానత్వానికి సంకేతమిది..
ఆజాదీకా అమృతోత్సవమిది..
నవతరానికి వజ్రోత్సవమిది..

వజ్రోత్సవమిది..
విశ్వ గురువుగా నిలిచే తరుణం..
కలలకు కళల అద్భుత కవనం..
ఎల్లలు దాటి నింగిన మెరిసి..
ప్రపంచానికి దిక్సూచిగ నిలిచి..
కుల మత జాతి బేధాలను సమసి..
సమతా మమత కారుణ్యాలను వెలసి..
ఝాన్సీ రుద్రమల హార్యాన్ని కలబోసి..
శివాజీ కత్తికి మొలచిన శౌర్యాన్ని..
గుండెల్లో ధైర్యాన్ని నింపి..
గడపగడపకు చైతన్యాన్ని పంచి‌..
ప్రజాస్వామ్యానికి పట్టం గట్టే..
అమృతోత్సవమిది..

జయహో భారత మాత..
జయ జయహో భారత మాత..
ఎగరాలి ఎగరాలి జెండా..
నింగిన నిలిచే నీ చరిత..
అమృతోత్సవమై మెరిసే గీత..
విశ్వగురువుగా నిలిచే సీతా..
జయహో భారత మాత.

– రాజేంద్ర

LEAVE A RESPONSE