Suryaa.co.in

Andhra Pradesh

సబ్ ప్లాన్ అమలుపై దళిత మంత్రులు బహిరంగచర్చకు రావాలి

• సబ్ ప్లాన్ అమల్లో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో ఉందా…. సిగ్గులేకుండా అబద్ధాలు, మోసాలతో దళిత, గిరిజనుల్ని ఎన్నాళ్లు మోసగిస్తారు?
• దళిత గిరిజన సంక్షేమంపై జగన్ రెడ్డి చెప్పేవన్నీ కాకిలెక్కలు, కాకమ్మకబుర్లే.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

ఎస్సీఎస్టీల ఓట్లతో అధికారం దక్కించుకున్న జగన్ రెడ్డి, వారికి అమలుచేయాల్సిన సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లిస్తున్నదికాక, సిగ్గులేకుండా సబ్ ప్లాన్ అమల్లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని దుష్ప్రచారం చేస్తున్నాడని, తమవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై, దళిత, గిరిజన మంత్రులు నోరెత్తలేని దుస్థితిలో ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

“రాష్ట్రంలో పదేళ్లక్రితం అమల్లోకి వచ్చిన ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువుని జగన్ సర్కారు మొక్కుబడిగా పొడిగించింది. ఈ ప్రభుత్వం సబ్ ప్లాన్ గడువు పొడిగించకపో యినా, టీడీపీ ప్రభుత్వం రాగానే ఆపని చేసేది. ఊరికే గడువులు పొడిగిస్తే ఉపయోగం లేదు.. సబ్ ప్లాన్ అమలు కచ్చితంగా జరిగేలా చూడాలని జగన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

దళిత, గిరిజనులకు జగన్ ఏంచేశాడో ఆయా వర్గాల మంత్రులు చెప్పగలరా?
జగన్ ప్రభుత్వంలో ఒక్కశాతం కూడా సబ్ ప్లాన్ అమలుకాలే దు. టీడీపీప్రభుత్వం పకడ్బందీగా సబ్ ప్లాన్ అమలుచేసింది. దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు విరివిగా సబ్ ప్లాన్ నిధులు వెచ్చించారు. జగన్ ఊరికే పైకి మాత్రం కులా లు, మతాలు లేవు, అందరూ సమానమే అంటుంటాడు. కులాల మధ్య సామాజిక అంతరాలు ఉండబట్టే ఎస్సీఎస్టీలకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, ప్రత్యేక రాయితీలు లభించాయి. అవికాక ఆర్థిక, విద్యాపరమైన అంశాల్లో పాలకులు, ప్రభుత్వాలు అదన పు నిధులు కేటాయించి, ఎస్సీఎస్టీలను వృద్ధిలోకి తీసుకురావాలన్నదే రాజ్యాంగం కాన్సెప్ట్. కానీ జగన్ రెడ్డి ఆలోచనా విధానం అందుకు పూర్తివిరుద్ధం. చంద్రబాబు ఎస్సీఎస్టీల్లో సాధికారత తీసుకొచ్చేలా అనేక కార్యక్రమాలు అమలుచేశారు. ఈ ప్రభు త్వంగానీ, దళిత మంత్రులు గానీ దళిత, గిరిజనులకు జగన్ ప్రత్యేకంగా ఏంచేశాడో చెప్పగలరా? నవరత్నాలు అనేవి అందరికీ అమలుచేస్తున్న పథకాలు. కానీ సబ్ ప్లాన్ నిధులు అనేవి దళిత, గిరిజనులకు మాత్రమే ఖర్చుపెట్టాలి. నవరత్నాల్లో పెట్టే ఖర్చు ని దళిత, గిరిజ నుల లెక్కల్లో చూపడం ముమ్మాటికీ ఆయావర్గాలను వంచించడమే.

దళిత, గిరిజన సంక్షేమంపై జగన్ రెడ్డి చెప్పేవన్నీ కాకిలెక్కలే…
టీడీపీప్రభుత్వం ఎస్సీఎస్టీల దామాషాప్రకారం వారి అభివృద్ధి, సంక్షేమానికి విరివిగా నిధులు ఖర్చుచేసింది. చంద్రబాబు హాయాంలో ఎస్సీల సంక్షేమానికి రూ.40,240 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.14,210కోట్లు ఖర్చుపెట్టారు. రెండువర్గాలకు కలిపి రూ.52,462కోట్లు ఖర్చుపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.లక్షా41వేలకోట్లు అయితే, దాని లో రూ.52,462కోట్లు చంద్రబాబు ఎస్సీఎస్టీలకే వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ రూ.2,29,000కోట్లు, జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో దళిత, గిరిజనులకు పెట్టిన ఖర్చు కేవలం రూ.48వేలకోట్లు. అవికూడా నవరత్నాల్లో పెట్టిన ఖర్చే. దళిత, గిరిజన సంక్షే మంపై జగన్ చెబుతున్న లెక్కలన్నీ కాకిలెక్కలు, కాకమ్మకబుర్లే. టీడీపీ ప్రభుత్వం విదేశీవిద్య కింద 1200 మంది దళిత, గిరిజనుల్ని విదేశాలకు పంపింది. జగన్ ఒక్క దళితుణ్ణి అయినా విదేశాలకు పంపించాడా? చంద్రబాబు దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించడం కోసం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ప్రవేశ పెడితే, జగన్ వాటిని రద్దుచేశాడు? చంద్రబాబు అమలుచేసిన భూమి కొనుగోలు పథ కం, స్టడీసర్కిళ్లు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ వంటి వాటిని జగన్ ఎందుకు రద్దుచేశాడు? చంద్రబాబు ఎస్సీఎస్టీలకు భూమికొని పంచితే, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వారినుంచి 12వేల ఎకరాలు లాక్కున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు 4లక్షలమందికి స్వయంఉపాధి కల్పించాడు. నాలుగేళ్లపాలనలో జగన్ రెడ్డి నలుగురికైనా ఉపాధి కల్పించాడా? వైసీపీ ప్రభుత్వం లో ఎస్సీకార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కార్యాలయాలకు తాళాలేశారు. ఎస్సీల సంక్షేమానికి వెచ్చించాల్సిన రూ.12వేలకోట్లని జగన్ ప్రభుత్వం దారిమళ్లించిందని న్యాయస్థానమే చెప్పింది. ఎస్సీలకు రూపాయి సాయం చేయనప్పుడు, ప్రభుత్వం కోట్లరూపాయలు వృథా చేస్తూ ఎస్సీకార్పొరేషన్ ఎందుకు నిర్వహిస్తోంది?

అంబేద్కర్ స్మృతివనాన్ని నాశనంచేసిన జగన్ రెడ్డి, విగ్రహాల పేరుతో మరోసారి దళితులను మోసగించాలని చూస్తున్నాడు
జగన్ ని నమ్మి ఓట్లేసిన దళిత, గిరిజనుల నోళ్లలోనే ఆయన సున్నం కొట్టాడు. జగన్ పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు, వేధింపులు, అత్యాచారాలు దేశంలో ఎక్క డా జరగలేదు. దళిత, గిరిజన ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలపై మాట్లాడే ధైర్యం ఈప్రభుత్వానికి ఉందా? చేతిలో పత్రిక, టీవీ ఉన్నాయని సిగ్గులేకుండా దేశం లో సబ్ ప్లాన్ అమల్లో తొలిస్థానంలో ఉన్నామని విషప్రచారం చేస్తారా? 50వేల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి మంగళం పాడింది జగన్ రెడ్డి కాదా? ఏటా డీఎస్సీ అని దళిత, గిరిజన యువతని వంచించింది వాస్తవంకాదా? విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పేరుతో సినిమా చూపిస్తూ, దళితుల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో నిర్మించాలనుకున్న అంబేద్కర్ స్మృతివనాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి, విగ్రహాలపేరుతో దళితజాతిని మరోసారి మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన దళిత, గిరిజనులే ఆయన చెంపలు వాయించడం ఖాయం” అని ఆనంద్ బాబు హెచ్చరించారు.

LEAVE A RESPONSE