Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి

-నాడు దొంగలు, బందిపోట్లను చూసి ప్రజలు భయపడేవారు.. నేడు ముఖ్యమంత్రి పర్యటన అంటే భయపడుతున్నారు
-మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… రాష్ట్రంలోని పరిస్ధితులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన పెడితే ఎన్నో ఆంక్షలని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. నాడు దొంగలు, బందిపోట్లను చూసి ప్రజలు భయపడేవారు.
నేడు రాష్ట్రంలో ప్రజానీకం ముఖ్యమంత్రి పర్యటన అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాటు చేసే బారికేడ్లని గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు అంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా జగన్ రెడ్డి పర్యటనకు బందోబస్తు ఉంటోంది. భారీ నుంచి అతిభారీగా భారీగా బారిగేడ్లు పెడుతున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలలో దుకాణాలను మూసేస్తున్నారు. బలవంతంగా స్కూళ్ళకు సెలవులు ప్రకటిస్తున్నారు. ఆ స్కూళ్ల బస్సులను తీసుకొని ప్రజలను ముఖ్యమంత్రి కార్యక్రమానికి తరలించడానికి వినియోగిస్తున్నారు.

నాగార్జున యూనివర్సిటిలో వైసీపీ ప్లీనరీ సమావేశం పెడితే అనేక బస్సులను ప్రజలను యూనివర్శిటీకి తరలించడానికి వినియోగించారు. దీంతో అనేక మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్నిప్రజలందరూ చూశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న ప్రాంతాలలో బస్సులను నిలిపేస్తారు. ఆర్టిసీ బస్సులను తీసుకొని ప్రభుత్వ ఖర్చుతో వాళ్ల సొంత కార్యక్రమాలకు, మనుషులను తరలిచండానికి వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా సెలవు దినం ప్రకటిస్తే మందుల షాపుల పని చేస్తాయి.

అటువంటి మందుల షాపులను కూడా జగన్ రెడ్డి తన పర్యటన కోసం మూసేస్తున్నారు. చెట్లకు వైసీపీ రంగులు వేయడాన్ని ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు. జగన్ రెడ్డిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల పై బైండోవర్ కేసులు పెట్టడం దుర్మార్గం. ముఖ్యమంత్రి పర్యటనకు హాజరు కాకపోతే జరిమానాలు విధిస్తామని ప్రజల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

ముఖ్యమంత్రి వెళుతుంటే రాష్ట్రంలో కర్ఫూ వాతావరణం కనపడుతోంది. నాడు కారులో తిరుపతి వెళుతున్న కుటుంబాన్ని నడిరోడ్డు పై దించేసి ముఖ్యమంత్రి పర్యటనకు కారు కావాలని బలవంతంగా తీసుకెళ్లారు. మరో కుటుంబంలో వ్యక్తి చనిపోయినందుకు పిండ ప్రదానానికి వెళుతుంటే ముఖ్యమంత్రి వెళుతున్నారు మీరు వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నారు. వైజాగ్ లో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. వైజాగ్ లో ముఖ్యమంత్రి పర్యటన ఉంటే డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషన్ డిఇవోకి స్కూళ్ళకు సెలవులు ఇవ్వమని ఏ విధంగా కోరతారు?

స్కూళ్ళకు సెలవులివ్వమని, ఆ బస్సులు వైఎస్సార్ వాహనమిత్ర ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం తమకు కావాలని ఎలా అడుగుతారు? ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికారులకు టార్గెట్లని పెట్టి మరీ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని వరద ముంచెత్తడంతో గేటు కొట్టుకుపోయి అక్కడి పరిసర ప్రాంతాలన్ని అల్లకల్లోల మయ్యాయి. అటువంటి పరిస్ధితులలో కూడ కడప జిల్లాలో జగన్ రెడ్డి పర్యటనకు వెళితే బారిగేడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం ప్రచార ఆర్భాటానికే తప్ప ప్రజల సమస్యలని తీర్చడానికి కాదు.

తమ బాధలను చెప్పుకునే అవకాశం కూడా ప్రజలకు కల్పించడంలేదు. ముఖ్యమంత్రి పర్యటనలో బారిగేడ్లను ఏర్పాటు చేయించి అడ్డుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలలోకి ముఖ్యమంత్రి రావడానికి భయపడుతున్నారని అర్ధమవుతుంది. ముఖ్యమంత్రి తీరులో అభద్రతా భావం, అసహనం కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రజలను బలవంతంగా తరలించడమే కాకుండా, గేట్లకు తాళాలు వేసి బలవంతంగా పర్యటన పూర్తి అయ్యే వరకు జనాన్ని ఉంచటం అన్యాయం.

పోలీసులను కాపాలా పెట్టి జనాన్ని సభ నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పరదాలు కట్టుకొని పర్యటన చేసేది ఎవరు అని పోల్ పెడితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు వస్తుంది. జగన్ రెడ్డి పర్యటన తీరును చూస్తుంటే ప్రజలలో జగన్ రెడ్డి పరపతి పడిపోయిందని అర్ధమవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం పట్టుకుంది. తన సొంత నియోజకవర్గంలో బారిగేడ్లు కట్టుకొని తిరగాల్సిన అవసరమేమొచ్చింది? చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో యదేచ్ఛగా పర్యటించేవారు. హిట్లర్ వాసరసుడెవరంటే జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పగ, విద్వేషం, విధ్వంసాలతో హిట్లర్ ని మించిపోయాడు.

బిసిల ఆత్మ బంధువు చంద్రబాబు నాయుడు
జగన్ రెడ్డి తన వర్గం, బలగం ఉన్న చోటనే పోటీ చేశారు తప్ప సామాజిక నేపథ్యం లేదు. బీసీల ఆత్మ బంధువు చంద్రబాబు నాయుడు. కాబట్టే ఆయనను ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నాయకుడు ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. లోకల్, నాన్ లోకల్ అనే ప్రతిపాదన ఎందుకు వస్తుంది? బలం, బలగం ఉన్న చోట పోటీ చేయడం పెద్ద గొప్పా?, ఎటువంటి బలం, బలగం లేని చోట చంద్రబాబు నాయుడు పోటీ చేశారు.

బిసిల మీద మోసపూరిత ప్రేమను చూపించే జగన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో మంత్రులు ఎవరో చెప్పాలి. రెండు చోట్ల జగన్ రెడ్డి సామాజిక వర్గమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా రెడ్డికి ఎందుకు కట్టబెట్టారు. మంత్రి పదవులు కట్టబెట్టడానికి బిసి నాయకులు వారి కంటికి కనిపించలేదా? చిత్తూరు జిల్లాలో బిసిల పై అమితమైన ప్రేముంటే బిసిలకు ఎందుకు పదవిని ఇవ్వలేదు. బిసిలకు పై ఉన్నది కపట ప్రేమ అని వాళ్ళకు కూడ తెలుసు.

పోలీసు అధికారులతో ప్రజలను ఎంత నిర్భందించినా వాళ్ళలో తిరుగుబాటు వస్తుంది. వైసీపీని బంగాళఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

LEAVE A RESPONSE