-నిరాశ్రయులైన లను పరామర్శించిన బిజెపి ఎంపి జీవీఎల్
ఈరోజు అడివివరం గ్రామం సింహాచలం తొలి పావంచ ఎదురుగా ఉన్న స్థలంలోని ఇళ్లను రోడ్డు విస్తరణలో భాగంగా జీవీఎంసీ హఠాత్ గా కూల్చివేసిన నేపథ్యంలో నిరాశ్రయులైన వారిని బిజెపి ఎంపీ జీవీఎల్ పరామర్శించారు. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా , సమయాన్ని ఇవ్వకుండా దౌర్జన్యంగా తమ ఇళ్లను కూల్చివేసి సామాన్లను బయట పడవేసిన అధికారులు, మరియు అందుబాటులో లేకుండా పోయిన ఎమ్మేల్యే ఆవంతి శ్రీనివాస్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిని పరామర్శించడానికి వెళ్లిన జీవీఎల్ రాకతో నిరాశ్రయులైన మహిళలు భోరున విలపించారు. ఏ ఒక్క నాయకుడు ఉదయం నుంచి పరామర్శించలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపి జీవీఎల్ వారిని ఓదారుస్తూ వారి పట్ల అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తన అమానుషమనీ నిరాశ్రయులైన వారికి న్యాయం జరిగేలా తాను ప్రయత్నిస్తానని , అవసరమైతే తాను ఈ విషయం పైస్థాయికి తీసుకువెళతానని తెలిపారు.