అమరావతి: సింగపూర్ దౌత్యాధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ తో ఆయన భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు.. పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి, అవకాశాలను అన్వేషించే మార్గాలు తదితర అంశాలపై చర్చించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం.. సింగపూర్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది.సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని పేర్కొంది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ భేటీ జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తెలిపారు.