‘క్యాసినో’ కాక.. బొండా ఉమ కారు అద్దాలు ధ్వంసం
పామర్రు:-కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద తెదేపా శ్రేణులను, వైకాపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.పక్క పక్క వీధుల్లోనే తెదేపా, వైకాపా శ్రేణులు ర్యాలీలు చేశారు.కె కన్వెన్షన్ హాల్‌కు బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈసందర్భంగా తెలుగుదేశం నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.తెదేపా నేత బొండా ఉమ కారుతో పాటు తెదేపాకు చెందిన రెండు కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. వైకాపా కార్యకర్తలే ధ్వంసం చేశారని.. పోలీసులే దగ్గరుండి అద్దాలు పగులగొట్టించారని తెదేపా నేతలు ఆరోపించారు.