Suryaa.co.in

Telangana

పదేళ్ల కాలంలో తెలంగాణలో ప్రజాస్వామ్య విధ్వంసం

– ప్రొఫెసర్ హరగోపాల్

తెలంగాణ ఉద్యమ కాలంలో విభిన్న ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడి తెలంగాణ ఉద్యమానికిమంచి ఊపునిచ్చాయి. ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమ కాలంలో ఉన్న ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీలు నిద్రాన అవస్థలోకి జారుకున్న వేళ గడిచిన ఎన్నికలలో ఏర్పడిన ప్రభుత్వంలోని పాలకులు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్రాన్ని, ప్రజా విలువలను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్నివిధ్వంసం చేశారు.

ఒక విధంగా తెలంగాణలో ఫాసిస్టు పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజలలో మొదలైంది. కాబట్టి దాదాపు 40 సంస్థల భాగస్వామ్యంతో ఈరోజు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాం. రానున్న రోజులలో మరిన్ని సంస్థలు ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో పాలు పంచుకోనున్నాయి.

వచ్చిన తెలంగాణను,వనరులను, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పౌర సమాజానికి ఉంది, రానున్న రోజులలో అన్యాయాన్ని ప్రశ్నించే దిశగా పౌరులు గొంతెత్తి అవసరం ఎదురవుతుంది అని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

 

LEAVE A RESPONSE