Suryaa.co.in

Andhra Pradesh

పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధి

– రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

నెల్లూరు,సూర్య: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తరువాత కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి అంకితమవుతున్నాయమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, వెంగళరావు నగర్ లో షుమారు 20 లక్షల రూపాయల నిధులతో సి.సి. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాబోయే రెండు నెలల్లో 33వ డివిజన్ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తాం. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ప్రాంతాల అభివృద్ధికి అందరం ప్రశాంత వాతావరణంలో పనిచేసుకుందాం. నా లక్ష్యం ఒక్కటే… ఎన్డీఏ ప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా దివాళా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిన పెడుతున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో ముఖ్యంగా ప్రజా భాగస్వామ్యం ప్రజల సహకారం అవసరం.

కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు మన్నెం పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, టీడీపీ నాయకులు హజరత్ నాయుడు, బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య, టిడిపి నాయకులు వెంకట రమణయ్య , మెట్టు క్రాంతి, రమణయ్య నాయుడు, డిష్ చిన్న, నాని, కళ్యాణి, నిర్మలమ్మ, మౌలాలి, ఆనంద్, లాల్ మస్తాన్, కిషోర్ రాజు, సుబ్బయ్య, అశోక్, రమేష్ రెడ్డి, అభి, హరి, దాసరి పెంచలయ్య, మజీద్, అస్లాం, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE