Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేత

– ఆయన తప్పేమీలేదన్న మహిళ
– తానే తప్పుడు కేసు పెట్టానన్న మహిళ
– తొలుత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ
– కేసు కొట్టివేసిన హైకోర్టు

అమరావతి: బీమాస్ పారడైజ్ హోటల్‌లో తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను హైదరాబాద్‌లోమీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించించింది. టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

కేవీబీపురం మండలానికి చెందిన బాధిత మహిళ ఎవరూ ఊహించని విధంగా ఈనెల 20న హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని వివరించింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిమూలం, హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. మూడవ వ్యక్తి ప్రమేయంతోనే మహిళ కేసు పెట్టిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టి వేయాలని కోరారు.

బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్‌ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలని, మహిళ తరఫు న్యాయవాది, జితేందర్‌ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.దీనితో ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తేసే అవకాశాలున్నాయి.

LEAVE A RESPONSE