దేవుడు ప్రజల కోసమే ఆ దార్శనికుడిని బతికించారా?

( చాకిరేవు)
సరిగ్గా 23 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను తలచుకుంటే భయం వేస్తుంది!
రాజకీయ ముసుగు.. నక్సల్ ఆయుధం.. అలిపిరిపై రక్తపు ముద్ర!
అది 2003 అక్టోబర్ 1. తిరుమల గిరులు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ, ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలిపిరి ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా పాతాళం బద్దలైనంత విస్ఫోటనం సంభవించింది.
ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయ్ లక్ష్యంగా 17 బాంబులతో పేల్చిన క్లైమోర్ మైన్ పేలింది. అందులో తొమ్మిది పేలాయి. ఎనిమిది పేలలేదు. అంబాసిడర్ కారు గాలిలోకి లేచి మూడు పల్టీలు కొడుతూ పడింది. ఆ ఘటనలో ముఖ్యమంత్రి ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమైతే… ఆ పేలుడు వెనుక ఉన్న కఠోర సత్యం అంతకంటే దారుణమైన రాజకీయ, నేర ముఠాల కుట్ర.
ప్రజా పోరాటం, వర్గపోరాటం అంటూ గొంతుచించిన పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు తమను తాము పేదల రక్షకులుగా చెప్పుకున్నారు. కానీ, కాలక్రమేణా ఆ ఎర్రజెండా వెనుక దాగిన అసలు రంగు బయటపడింది. రాయలసీమ నడిబొడ్డు కడప ప్రాంతంలో ఏ ఫ్యాక్షన్ శక్తులను, ఏ ఎర్రచందనం స్మగ్లర్లను, ఏ ముగ్గురాళ్ల బైరటీస్ మైనింగ్ మాఫియాను, వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కొట్టేసిన ఆ రాక్షసులను ఈ నక్సలిజం అడ్డుకోలేదు.
ఇది నిజం కాకపోతే ఒకే ఒక్క సంఘటన చెప్పండి
ఆఖరికి ఆ ఫ్యాక్షన్ ముఠాల కాళ్ల దగ్గరే దండాలు పెట్టి, వారి దగ్గరే అంగట్లో సరుకులా అమ్ముడుపోయారు. వారితో ఈ నక్సల్స్ పోషించబడ్డారు అనడం కన్నా ప్రవేశపెట్టబడ్డారు అనేది.సహేతుకం.
కడప ఫ్యాక్షనిజం కేవలం కత్తులు, బాంబులకే పరిమితం కాలేదు. అది ప్రజాస్వామ్యాన్ని నేరాలకు ముసుగుగా మార్చుకుంది. జిల్లా నియోజకవర్గాలను భయపెట్టి గుప్పిట పట్టి శాసించే స్థాయికి ఎదిగిన ఫ్యాక్షన్ నాయకులు, తమ అక్రమ సామ్రాజ్యాలకు అడ్డుగా ఉన్న వ్యవస్థను కూల్చడానికి “నక్సలిజం” అనే ఆయుధాన్ని వాడుకున్నారు.
అలిపిరి వద్ద జరిగింది కేవలం ఒక నక్సల్స్ దాడి మాత్రమే కాదు. అది మూడు నేర భాగస్వాముల పక్కా స్కెచ్:
ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు: అధికారం కోసం, తమ వర్గ రాజకీయాల ఆధిపత్యం కోసం రాష్ట్రాన్ని అస్థిరపరచాలనుకున్న రాజకీయ శక్తులు.
ఎర్రచందనం స్మగ్లర్లు: శేషాచలం అడవులను గుల్ల చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌లు (కొల్లం గంగిరెడ్డి లాంటి నెట్‌వర్క్‌లు). ఆపరేషన్లతో తమ ఆదాయానికి గండికొడుతున్న ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యం.
పీపుల్స్ వార్ గ్రూప్: సిద్ధాంతాలు వదిలేసి, ఆపరేషన్లకు డబ్బులు, లాజిస్టిక్స్ కావాలనే ఆశతో ఫ్యాక్షనిస్టులకు, స్మగ్లర్లకు “కిరాయి హంతకులుగా” మారిన నక్సల్స్.
ఈ ముగ్గురి శత్రువు ఒక్కడే… అప్పటి రాష్ట్ర పరిపాలకుడు, ఉమ్మడి ఆంధ్రా సీఈఓ, హైటెక్ సీఎం చంద్రబాబు!
డబ్బు, భోజన వసతులు ఫ్యాక్షనిస్టులు, స్మగ్లర్లవి; ఆయుధాలు, వ్యూహం నక్సల్స్‌ది.
కొండపైన బ్రహ్మోత్సవం.. కింద భారీ కుట్ర!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న చంద్రబాబుపై, దేవుని పాదాల చెంతనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. 200 కిలోల నోబెల్ జెల్ పేలుడు పదార్థాలు, క్లైమోర్ మైన్, రిమోట్ కంట్రోల్ వైర్లు… ఇవన్నీ అడవిలోకి ఎలా వచ్చాయి? కొండ కింద రక్షణగా నిలిచిన స్మగ్లర్ల నెట్‌వర్క్, ఈ ఫ్యాక్షన్ మరియు స్మగ్లర్ల రక్షణ కవచం లేకపోతే ఇది సాధ్యమయ్యేదా?
పీపుల్స్ వార్ గ్రూప్ తనను తాను “విప్లవ దళం” అని పిలుచుకున్నప్పటికీ, ఫ్యాక్షనిస్టులు విసిరిన డబ్బుకు కక్కుర్తిపడి, వారి కక్ష సాధింపులకు సుపారీ గ్యాంగ్‌లా మారిపోయింది. పవిత్రమైన ఏడుకొండల సాక్షిగా రక్తపాతం సృష్టించి, అధికారాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని చూసిన ఫ్యాక్షన్ రాజకీయం, దానికి ఊడిగం చేసిన నక్సలిజం ఆ రోజు నగ్నంగా సమాజం ముందు నిలబడ్డాయి.
అలిపిరి ఘటన మనకు నేర్పిన చేదు నిజం ఒక్కటే — రాజకీయాలు నేరమయమై, ఫ్యాక్షనిజం సిద్ధాంతంతో జతకట్టి, నక్సలిజం దానికి అమ్ముడుపోయినప్పుడు ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో అలిపిరి పేలుడు నిరూపించింది.
అలిపిరిలో ఆ కులదైవమే ఊపిరిని ప్రసాదంగా ఇచ్చి, ఆంధ్రా పునర్నిర్మాణానికి నీ జీవితం అంకితమని కాపాడిన ఆ సన్నివేశం… మూడు పల్టీలు కొట్టిన కారులో నుండి లేచి, తనతో ఉన్న వారికి “ఏమి జరిగింది?” అని ఆశ్చర్యంగా అడిగిన ఆ ధైర్యాన్ని ఎవరూ మర్చిపోలేరు.
రాజకీయం ముసుగు వేసుకున్నా, ఎర్రజెండా అండ చూపెట్టినా… ద్రోహం ద్రోహమే, నేరం నేరమే!
కానీ ఆయన పగ తీర్చుకోలేదు. పురమాయించిన రాజకీయమే, అధికారం కోసం పావులుగా వాడుకుని చర్చలంటూ పిలిచి మట్టుబెట్టింది. ఇటీవల కాలంలో మిగిలిన ఆ నక్సల్స్ అంతమయ్యారు.
కానీ ఆ సంఘటన జరిగిన వెంటనే వచ్చి స్కెచ్ వేసిన (చాలా తెలివిగా తనకు మట్టి అంటకుండా) కడప ఫ్యాక్షన్ వారసుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎక్కడి నుండో వచ్చి అలాంటి కుట్రలకు పావులైన విషపాముల వంటి భూమన కుటుంబ సభ్యులు… అదే తిరుపతిలో ఇది “పిరికిపందల పని” అని రోడ్డు మీద లుంగీలతో బైఠాయించిన దృశ్యం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది.
రాడికల్స్ నుండి విరసం వరకు పుట్టింది తెలంగాణలో కాదు. ఫ్యాక్షన్ ముఠా నాయకుడు రాజారెడ్డి స్పాన్సర్ చేసిన (చెవిరెడ్డి, భూమన) ముసుగులో.. అదే శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో! అందుకే పేదల ముసుగులో పుట్టిన ఆ సంస్థలను ధర్మం దండించింది, నామరూపాలు లేకుండా తుదముట్టించింది.
క్యుములో నింబస్ మేఘమే క్లైమోర్ మైన్ అయ్యింది.
కానీ ఆ వారసత్వం కొండ మీద నుండి రాష్ట్రమంతా విధ్వంసం చేసి తిన్నది చాలకుండా.. “రఫ్ఫా రఫ్ఫా” అంటూ బుసలు కొడుతోంది. ధర్మం ఏమి వ్రాసి పెట్టి ఉందో!
కానీ ఆ విధ్వంసం నుండి కాపాడడానికి ఇరవై మూడేళ్ల క్రితమే మూడు నామాల శ్రీ మహావిష్ణువు మన కోసం, మన అభివృద్ధి కోసం ఆ దార్శనికుడిని అట్టిపెట్టాడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆయుస్సు కోసం తమ ఆయుష్షులో ఒక్క రోజు అయినా తీసుకోమని భగవంతుని ప్రార్థించేవారు లక్షల్లో ఉన్నారు.
అందులో నేనొక్కడిని!
