రాజ్యసభలో మంత్రిని ప్రశ్నించిన వి.విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ: గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ఆయిల్ ధరలకు కళ్ళెం వేసేందుకు అమెరికా, జపాన్‌లతో పాటు భారత్ తన వద్ద ఉన్న నిల్వల్లో 5 మిలియన్ బారెళ్ళ క్రూడ్‌ను విడుదల చేసింది.
దీని ప్రభావం అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలపై ఏ మేరకు ఉందో వివరించాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో పెట్రోలియం శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది. దీనికి మంత్రి హర్దీప్ సింగ్ పూరి జవాబిస్తూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు గత ఏడాది నవంబర్లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో సంభవించిన విపరీతమైన హెచ్చుతగ్గుల కారణంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోపాటు భారత్ కూడా తన వద్ద ఉన్న వ్యూహాత్మక క్రూడాయిల్ నిల్వల్లో 5 మిలియన్ బారెళ్ళు విడుదల చేసిన వమేనని అన్నారు.