Suryaa.co.in

Political News

ధనంజయ రెడ్డిని వైకాపా కరేపాకును చేసిందా?

జగనుకు కళ్లు, చెవులు లాగా పనిచేసిన ఆయన కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి రిటైర్మెంట్ నిన్న. ఆయన రిటర్మెంట్ సభలో ఏ అధికారులు పాల్గొన్నారో & ఎంత ఘనంగా వీడ్కోలు పలికారో చూద్దామని సాక్షిని తిరగేస్తే.. అందులో అధికారుల పేర్లు లేవు. ఫోటో చూస్తే శ్రీలక్షి వున్నట్లుగా మసక మసకగా కనిపించింది సాక్షి పత్రికలో. సాక్షి వెబ్‌సైటులో వెతికా డిజిటల్ ఫోటోలో క్లారిటీ వుంటుంది అని. గంట సేపు వెతికినా ఆ వార్త కనిపించలేదు. ఈపేపర్ మరియు ప్రింట్ ఎడిషన్లో ఎనిమదవ పేజీలో చిన్నదిగా వేశారు, ఈ వార్త.

అసలు ధనంజయ రెడ్డికి ఐఏఎస్‌ హోదా రావడమే చిత్రవిచిత్రంగా జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అండమాన్‌-నికోబార్‌ దీవుల నుంచి ఆయన్ను ఏపీకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్‌ హోదా కల్పించింది. తొలి నుంచి అత్యంత ప్రాధాన్య పోస్టింగుల్లో నియమించింది. శుక్రవారంతో ఆయన 60 ఏళ్లు పూర్తికావడంతో పదవీ విరమణ చేశారు.

జగన్ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన వైభోగం & వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను డిసైడ్ చెయ్యడంలో కూడా ఆయన పాత్ర గురించి పుంఖాను పుంకాలుగా వార్తలు వచ్చేవి. అలాంటి ఆయన రిటైర్మెంట్ అంటే ఘనంగా నిర్వహించి, వైకాపా సోషల్ మీడియాలలో కూడా వేస్తారని పప్పులో కాలేశా.

వైకాపా సర్వనాశనానికి, జగన్‌కు ఎదురవ్వబోయే ఘోర ఓటమికి ఆయనే కారణం అని గుర్రుగా వున్నట్లుంది తాడేపల్లి. సాక్షిలో కరేపాకును చేశారు. ఇక ఐఏఎస్ అధికారులు కూడా మొహం చాటేశారు. జగన్ మాజీ బ్యాచ్‌మేట్ శ్రీలక్ష్మి, త్వరలో వెళ్లబోయే కొందరు వున్నట్లున్నారు. వీడ్కోలు సభలో పాల్గొన్న వారి పేర్లు కూడా వ్రాయలేదంటే.. ఇక చూసుకోండి అక్కడ పరిస్థితి ఎలా వుందో?!

– ఏ.బాబు

LEAVE A RESPONSE